రైతుబంధు దెబ్బ కాంగ్రెస్ కా బీఆర్ఎస్ కా ?

తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలలో రైతుబంధు( Rythu Bandhu ) అత్యంత ముఖ్యమైనది.ప్రతి సంవత్సరం వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేసే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం అధికార పార్టీకి చాలా మంచి పేరున తీసుకొచ్చింది.

 Is Rythu Bandhu Hit By Congress Or Brs? , Rythu Bandhu , Congress Party , Revan-TeluguStop.com

పెద్ద మొత్తం లో ఉన్న చిన్న సన్నకారు రైతులు ఈ మొత్తం తో ఎటువంటి ఇబ్బంది లేకుండా , దళారుల బాద లేకుండా వ్యవసాయం చెయ్యగలుగుతున్నారు .

Telugu Brs, Cm Kcr, Congress, Harish Rao, Revanth Reddy, Rythu Bandhu, Ts-Telugu

అధికార పార్టీ కి ఎన్నికల లో బారీ లబ్ధి చేకూర్చే పధకాలలో ఇది కూడా ఒకటని చెబుతారు .అలాంటి ముఖ్యమైన ఈ పధకం లో ఇప్పుడు ఎన్నికల సంఘం జోక్యం తి నిదుల విడుదల ఆగిపోవడం తో రైతులు ఇబ్బంది పడుతున్నారు .ఎన్నికల చివరి దశలో నిబందనల మేరకు నిధుల నిలిపివేత జరగడంతో ఇప్పుడు అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.

Telugu Brs, Cm Kcr, Congress, Harish Rao, Revanth Reddy, Rythu Bandhu, Ts-Telugu

అయితే ఎన్నికల కోడ్( Election Code ) అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈసీ నిబంధనలను పట్టించుకోకుండా నిధులు అంశాన్ని ప్రస్తావించిన ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు దే తప్పని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శిస్తుంటే, రైతులకు మంచి జరగటం ఇష్టం లేకనే ఈ పథకం పై మళ్లీ మళ్లీ ఈసీకి ఫిర్యాదులు చేసిన కాంగ్రెస్ దే తప్పని, రైతులు బాగుపడటం కాంగ్రెస్ కి ఇష్టం లేదంటూ బీఆరఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.అయితే ఏది ఏమైనా అత్యంత కీలకమైన దశలో నిధులు నిలిచిపోవడంతో రైతులలో ఏర్పడే అసంతృప్తి ఏ పార్టీకి నష్టం చేస్తుంది , ఏ పార్టీకి లాభం చేస్తుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.అయితే అధికార పార్టీ కావాలనే కాంగ్రెస్ ను బదనాం చేయడానికి నిబంధనలను బేకాతరు చేసిందని ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ను నిందిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి .ఎన్నికల చివరి నిమిషం అస్త్రం గా బి ఆర్ఎస్ దీనిని వాడుకోవాలని చూస్తుందని అందుకే ఎన్నికల కోడ్ గురించి పూర్తి సమాచారం ఉన్నా కూడా ఇలా వ్యవహరించిందని వీరు విశ్లేషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube