హైదరాబాద్‌లో పవన్‌ ప్రచారం చేస్తాడా?

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం చేస్తాడు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి సిద్దం అవ్వాలంటూ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

కనీసం 40 నుండి 50 స్థానాల నుండి జనసేన పార్టీ అభ్యర్థలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ను ఇరుకున పెట్టేలా పవన్‌ ప్రచారం చేస్తాడా లేదా అనేది తెలియదు.

ఎందుకంటే గతంలో పలు సార్లు టీఆర్‌ఎస్‌ కు మద్దతుగా పవన్‌ మాట్లాడాడు.కనుక జనసేన పార్టీ తరపున నిలబడే అభ్యర్థలు వారికి వారే ప్రచారం చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

పార్టీ ప్రచారం బాధ్యతలను ముఖ్యులకు అప్పగించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.పవన్‌ రెండు వారాల పాటు వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ కు బ్రేక్‌ తీసుకున్నాడు అని.అందుకు కారణం ఎన్నికలే కారణం అంటూ ప్రచారం జరుగుతోంది.అందుకు సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో అసలు విషయం ఏంటీ మాత్రం జనసేన ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

రాజకీయాల్లోకి ఇప్పటికి కూడా పవన్‌ పూర్తి స్తాయిలో వచ్చినట్లుగా అనిపించడం లేదు.ఎందుకంటే జనసేన పార్టీని ఈ ఎన్నికల్లో పోటీగా సొంతంగా నిలపడం కంటే బీజేపీతో సన్నిహితంగా ఉంటూనే ఆ పార్టీతో కలిసి పోరాడటం బెటర్‌ అనిపిస్తుంది.

అయితే బీజేపీతో కలిస్తే జనసేన పార్టీపై టీఆర్‌ఎస్‌ కక్ష కట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే జన సేన పార్టీ కోసం హైదరాబాద్‌ లో పవన్‌ ప్రచారం చేయకుంటేనే బెటర్‌ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

పవన్‌ మనసులో ఏం ఉంది అనే విషయం ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ కొత్త సినిమాకు మెగాస్టార్ టైటిల్ ఫిక్స్ అయిందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు