కత్తిపూడి బహిరంగ సభ వేదిక గా పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసాయి గతంలో పార్టీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం పదవి పై ఒకింత నిరుత్సాహంగా మాట్లాడిన పవన్ ( Pawan kalyan )కత్తిపూడి వేదికగా మాత్రం చాలా స్పష్టంగా సీఎం పదవి ఇస్తే తీసుకుంటానంటూ వ్యాఖ్యానించారు .
ఇవ్వాల్సింది ప్రజలే అయినప్పటికీ తన సామాజిక వర్గం గట్టిగా ప్రయత్నిస్తే పవన్ కి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి.
అయితే పవన్ రాజకీయ ప్రయాణం మీద అంత సంతృప్తిగా లేని ఆయన సామాజిక వర్గం ఆయనతో కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తుంది.తనకు కులాలు ముఖ్యం కాదని పవన్ పదేపదే చెబుతున్నప్పటికీ కులం ఆదారిత రాజకీయాలు మాత్రమే నడిచే ఆంధ్రప్రదేశ్లో కులాల మద్దతు తప్పనిసరి.
అందుకే పార్టీలు కూడా అభ్యర్థులను ఆయా స్థానాలలో ఉన్న సామాజిక వర్గాలను బట్టే నిర్ణయిస్తుంటాయి.అందువల్ల జనసేన ఎంత కాదనుకున్న కాపు సామాజిక వర్గం ఓట్లు లేకుండా గమ్యాన్ని చేరలేదు.
తెలుగుదేశం పార్టీతో సఖ్యత నడపటం సాయన సామాజిక వర్గంలో చాలా మందికి రుచించని విషయం.ముఖ్యంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ ( Mudragada Padmanabham )వ్యవహారంలో చంద్రబాబు ( Chandrababu Naidu )వ్యవహరించిన శైలి కాపులలో ఆయనకు శత్రువులు తెచ్చిపెట్టింది .అయితే ఈసారి జనసేన వ్యూహాత్మకంగా ఎన్నికలకు సిద్ధమవుతుండటం , తన బలం గుర్తించి ముందుకు వెళ్ళటం వంటి సంకేతాలతో ఈసారి పవన్ సరైన ట్రాక్ లోనే ఉన్నారని అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది .
దీంతో ఆయన సామాజిక వర్గం కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని , అంగ బలం, అర్థబలంతో తోడ్పాటు ఇవ్వాలని చూస్తునట్లుగా కూడా విశ్లేషణలు వస్తున్నాయి.కనీసం 30 నుంచి 40 స్థానాలలో తన బలం జనసేన నిరూపించుకుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో ప్రబుత్వ ఏర్పాటు లో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం అనుమానం లేదు.మాజిక్ పిగర్ 88 కాబట్టి 30నుంచి 40 సీట్లు కూడా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది .మరి ఇదే ఊపును జనసేన ని కొనసాగిస్తే మాత్రం జన సైనికుల కల నెరవేరడానికి ఎంతో దూరం లేదని చెప్పవచ్చు .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy