Kushi Kapoor : కోలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీదేవి చిన్న కుమార్తె.. హీరో ఎవరో తెలుసా?

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి గురించి మనందరికీ తెలిసిందే. శ్రీదేవి ( Sridevi )బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ పెళ్లి చేసుకోగా ఈ దంపతులకు ఖుషి కపూర్, జాన్వీ కపూర్ అనే ఇద్దరు కూతుర్లు కూడా ఉన్న విషయం తెలిసిందే.

 Is Kushi Kapoor All Set To Make Kollywood Debut-TeluguStop.com

వీరిలో ఇప్పటికే జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.ప్రస్తుతం జాన్వీ కపూర్( Janhvi Kapoor ) జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ.

Telugu Atharva, Bollywood, Debut, Janhvi Kapoor, Kollywood, Kushi Kapoor, Sridev

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్( Kushi kapoor ) కి సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అవేమిటంటే.ఖుషి కపూర్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

అయితే ఆమె మొదట కోలీవుడ్ సినిమాలు నటించబోతున్నట్టు తెలుస్తోంది.తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక యువ హీరోకు జంటగా ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ మొదలు కానుందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ది అర్చీస్‌ తో నటిగా తెరంగేట్రం చేశారు ఖుషి కపూర్‌.

( Kushi kapoor ) మ్యూజికల్‌ కామెడీ ఫిల్మ్‌గా ఇది సిద్ధమవుతోంది.ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.

Telugu Atharva, Bollywood, Debut, Janhvi Kapoor, Kollywood, Kushi Kapoor, Sridev

ఇదిలా ఉండగా, ఖుషి కపూర్‌( Kushi kapoor ) త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్ట బోతోంది అంటూ తాజాగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కోలీవుడ్‌ హీరో అధర్వ( Atharva ) హీరోగా తెరకెక్కనున్న ఒక సినిమాలో ఆమె కథానాయికగా కనిపించనున్నారని సమాచారం.విఘ్నేశ్‌ శివన్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆకాశ్‌ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారని తెలుస్తోంది. ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ రూపొందనుందని, అనిరుధ్‌ స్వరాలు అందించనున్నారు అంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

ఇందులో నిజా నిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube