భారత దేశ చలన చిత్ర రంగంలో కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మొట్టమొదటిసారిగా కన్నడ చిత్ర రంగం నుండి ఓ సినిమా ఈ రేంజ్ లో ఆకట్టుకోవడం ఇదే మొదటిసారి.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచం నలుమూలల భారీ హిట్ సాధించింది.ఇందులో కన్నడ సూపర్ స్టార్ యష్ చోప్రా హీరోగా నటించారు.ఇకపోతే కేజీఎఫ్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 మీదనే ఇప్పుడు దేశమంతా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తోంది.
2021 సంక్రాంతి పండుగ బరిలో దిగేందుకు ఈ సినిమా సన్నద్ధమవుతోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరిస్తుంది.ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో టాకీ పార్ట్ ముగియగా, క్లైమాక్స్ సీన్ మాత్రం కాస్త బ్యాలెన్స్ ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అన్ లాక్ రూల్స్ లో భాగంగా సినిమా షూటింగ్ మొదలవగా ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఇకపోతే ఈ సినిమాలో హీరో యష్ రాజ్ నటించబోయే యాక్షన్ చిత్రాలు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి.ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు తెలిసిందే.
ఇక హీరో యష్ అలాగే విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నడుమ భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతుందట్లుగా సమాచారం.ఇది ఇలా అంటే… టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన బాహుబలి రెండవ పార్ట్ లో ప్రభాస్, రానాల మధ్య జరిగిన పోరాటం కంటే అంతకుమించి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఆ క్లైమాక్స్ సీన్ గురించి అనేక మంది రెండు సంవత్సరాల నుంచి చర్చించుకుంటున్నారు.ఇకపోతే కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతే బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని సినీ పండితులు భావిస్తున్నారు.