ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హీట్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నాయి.
ముఖ్యంగా అధికార బిఆర్‌ఎస్( BRS ) మరియు కాంగ్రెస్ పార్టీల( Congress ) మద్య టఫ్ ఫైట్ నెలకొంది.కాగా ఎన్నికల ముందు అధికార బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు భారీగా చేరికలు జరిగిన సంగతి తెలిసిందే.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణరావు. ఇలా చాలమంది కీలక నేతలు హస్తం గూటికి చేరారు.
అయితే వీరు కాంగ్రెస్ లో చేరిన తరువాత బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ పై( KCR ) తీవ్ర స్థాయిలో విమర్శలు గుపిస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు కేసిఆర్ ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా పాలేరు నుంచి పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) మరియు ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు లపై( Tummala Nageswararao ) గులాబీ బాస్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.ఎలాగైనా వారి దూకుడుకు చెక్ పెట్టాలని కేసిఆర్ ఆలోచిస్తున్నారట.పొంగులేటికి పోటీగా పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డిని( Kandala Upender Reddy ) బరిలోకి దించారు కేసిఆర్.గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరుపున విజయం సాధించారియన అయితే గతంలో పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన పొంగులేటి ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
దీంతో పాలేరులో ఎవరు సత్తా చాటబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

అటు ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు.ఈయన గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి అపజయం మూటగట్టుకున్నారు.ఈసారి ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
ఇక్కడ బిఆర్‌ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్( Puvvada Ajay Kumar ) పోటీలో ఉన్నారు.దీంతో ఇటు ఖమ్మంలో గాని, అటు పాలేరులో గాని.
పొంగులేటి, తుమ్మలకు గట్టి పోటీనిచ్చే నేతలు బరిలో ఉండడంతో వారిద్దరిని ఎదుర్కోవడం సాధ్యమే అనే ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు లకు ప్రజా మద్దతు కూడా గట్టిగానే ఉంది.
దానికి తోడు ఈసారి వారి విజయంపై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉండడంతో ఆ రెండు చోట్ల ఈసారి బిఆర్‌ఎస్ ఓటమి ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.