కాంగ్రెస్ టార్గెట్ గానే కెసీఆర్ ప్రధాన వ్యూహం రచిస్తున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజుకు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణ ఏర్పడిన మొదటి దశలో తెలుగు దేశం పార్టీని తెలంగాణలో భూ స్థాపితం చేయాలన్న లక్ష్యంతో పావులు కదిపిన కెసీఆర్ తెలంగాణలో తెలుగు దేశం పార్టీ మెజారిటీగా కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది.

 Is Kcr Formulating The Main Strategy As The Congress Targe Kcr, Trs Party, Revan-TeluguStop.com

అదే వ్యూహాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పై కెసీఆర్ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది.

అందుకు బీజేపీని పావుగా ఎంచుకొని కాంగ్రెస్ విమర్శల పట్ల గానికాంగ్రెస్ కార్యచరణ పట్ల గాని ఏ మాత్రం ఇటు కెసీఆర్ కాని, టీఆర్ఎస్ వర్గాలు కాని స్పందించడం లేదు.

ప్రస్తుతం చాలా వరకు టీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేయాలనే ప్రధాన వ్యూహంతో ముందుకు సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీ మరింత పటిష్టం కావడానికి అడ్డుకట్టలా మారే అవకాశం ఉందనే ఆలోచనలో కెసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.

Telugu @cm_kcr, @revanth_anumula, Bandi Sanjay, Bjp, Etala Rajender, Telangana,

అందుకే బీజేపీని ఎరగా వేసి బీజేపీపైనే రాజకీయంగా చర్చ జరిగేలా వాతావరణం క్రియేట్ చేసి తద్వారా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల దృష్టి మరల్చకుండా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలహీనం చేయవచ్చుననేది కెసీఆర్ వ్యూహంలా కనిపిస్తోంది.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉన్నా నేతల మధ్య కలహాలు ఉన్నా బీజేపీలా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయకుండా చాలా క్లిష్టమైన అంశాలను ఎంచుకుంటూ కెసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తున్నా కనీసం ఏ ఒక్క టీఆర్ఎస్ నేత నుండి కూడా మద్దతురాకపోవడంతో రేవంత్ వ్యూహాలు ఆశించినంత మేర సఫలం కానటువంటి పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో మరి కెసీఆర్ రాజకీయ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube