ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర రైలు ప్రయాణం అవసరమా.... వీడియో వైరల్..

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థలు కలిగిన దేశాలలో మన దేశం కూడా ఒకటి.మనదేశంలో ప్రతిరోజు కొన్ని కోట్లమంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు.

 Is It Necessary To Take A Dangerous Train Journey At The Risk Of Life Video Vira-TeluguStop.com

దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.ఎందుకంటే రైలు లో ప్రయాణం చేసేటప్పుడు నిద్రపోతూ, ఆకలి వేస్తే తింటూ హాయిగా ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు.

ఇంకా చెప్పాలంటే బస్సు చార్జీల కంటే రైలు చార్జీలు తక్కువగానే ఉంటాయి.అందువల్ల రైలు ప్రయాణం చేయడానికి చాలామంది ప్రజలు ఇష్టపడతారు.

కానీ కొన్నిసార్లు రైలులో ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ఉంటారు.అయితే రైలు పై భాగంలో కూర్చుని ప్రయాణం చేయడం అనేది చాలా ప్రమాదకరం.

రైల్వే శాఖ ఇలాంటి ప్రయాణాలను చేయకూడదని ఎప్పటికప్పుడు ప్రయాణికులను హెచ్చరిస్తూనే ఉంటుంది.అయినా కూడా కొంతమంది ప్రజలు ఇలాంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు.అలాంటి ఒక ప్రమాదకర ప్రయాణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసి చాలామంది షాక్ కి గురవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో రైలు పై భాగం మీద వందలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.రైలు మాత్రం ఆ అందమైన ప్రకృతిలో ప్రయాణం చేస్తూ ఎత్తైన వంతెన మీదుగా ఒక మోస్తారు వేగంతో వెళుతుంది.

ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏ మాత్రం భయపడకుండా రైలు పైన నిలబడి, మరికొందరు కూర్చొని హాయిగా ప్రయాణిస్తున్నారు.కొంతమంది యువత ఈ రైలు మీద పార్కులో నిలబడినట్లు రైలు పైన నిలబడి ఉన్నారు.ఈ వీడియో రాజస్థాన్ లోని అరావళి కొండల మీదుగా రైలు ప్రయాణిస్తున్నప్పుడు వీడియో తీశారు.సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన వారు మాత్రం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇలా కూర్చున్నారు రైలు సడన్ బ్రేక్ వేస్తే వీరి పరిస్థితి ఏమవుతుంది అని కామెంట్లు చేస్తున్నారు.

ఈ షాకింగ్ వీడియోను ఇప్పటి వరకూ 36 లక్షల మంది చూశారు.ఇది ప్రమాదకరమని కొందరు, మరి కొందరు ఇంతమంది భయపడలేదాఅని అంటు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube