ప‌చ్చ‌ళ్లు ఆరోగ్య‌మా? కాదా?.. ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దు?

ప‌చ్చ‌ళ్లు.( Pickles ) పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతుంటాయి.అవంటే మనకంత ఇష్టం మరి.

వేడి వేడి అన్నంలో కాస్తంత కొత్త పచ్చడి, నెయ్యి క‌లిపి తింటే స్వ‌ర్గం గుర్తుస్తుంది.అయితే నిత్యం ప‌చ్చ‌ళ్లు తినేవారు కొంద‌రైతే.

అప్పుడ‌ప్పుడే తినేవారు మ‌రికొంద‌రు.ఏదేమైనా మ‌న‌ తెలుగోళ్ల‌కు ప‌చ్చ‌ళ్ల‌కు విడ‌తీయ‌లేని సంబంధం ఉంది.

ఒక‌ప్పుడు ప్ర‌ధానంగా వేస‌విలో దొరికే మామిడికాయ‌ల‌తోనే ప‌చ్చ‌ళ్లు( Mango Pickles ) ప‌ట్టేవారు.కానీ ఇప్పుడు ఉసిరి, నిమ్మ, ట‌మాటో, క్యారెట్, చిక్కుడుకాయ‌, కాలీఫ్లవర్, గోంగూర ఇలా ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్లు త‌యారు చేస్తున్నారు.

ఇక నాన్ వెజ్ పికిల్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అయితే ప‌చ్చ‌ళ్లు ఆరోగ్య‌మా? కాదా?.అస‌లు ఎవ‌రెవ‌రు ప‌చ్చ‌ళ్లు తిన‌కూడ‌దు? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.పచ్చళ్ల ఆరోగ్య‌క‌ర‌మే.

Advertisement

పచ్చళ్లను మితంగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.పచ్చళ్లలో ఉండే న్యాచురల్ ఫెర్మెంటేషన్ వల్ల ప్రొబయాటిక్స్ లభిస్తాయి, ఇవి మంచి బ్యాక్టీరియా( Good Bacteria ) పెంచి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

అలాగే మామిడికాయ, ఉసిరికాయ, నిమ్మకాయ వంటి పచ్చళ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.అందువ‌ల్ల ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను త‌గ్గిస్తాయి.

ఒక్కోసారి ఆక‌లి మంద‌గిస్తుంటుంది.దాని వ‌ల్ల భోజ‌నం స‌రిగ్గా చేయ‌రు.అలాంటి స‌మ‌యంలో కొంచెం పచ్చడి కలిపి తింటే ఆకలి పెరిగే అవకాశం ఉంటుంది.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

ప‌చ్చ‌ళ్ల త‌యారీలో వాడే మిరప కారం, పసుపు, వాము, మెంతులు, ఆవాలు, నిమ్మరసం వంటి ప‌దార్థాల‌న్ని శరీరానికి మేలు చేసేవే.అయితే పచ్చళ్లు తినొచ్చు.కానీ మితంగా తినాలి మ‌రియు ఇంట్లో చేసిన వాటినే ఎంపిక చేసుకోవాలి.

Advertisement

ఎందుకంటే, పచ్చళ్లలో ఎక్కువగా ఉప్పు, నూనె ఉంటాయి.వీటి కార‌ణంగా రక్తపోటు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశముంది.

ఆల్రెడీ హై బీపీతో( High BP ) బాధ‌ప‌డుతున్న‌వారైతే ప‌చ్చ‌ళ్ల జోడికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.అలాగే కిడ్నీ సమస్యలు( Kidney Problems ) ఉన్నవారు ప‌చ్చ‌ళ్లు తిన‌కూడ‌దు.ప‌చ్చ‌ళ్ల‌లో ఉండే ఎక్కువ ఉప్పు వల్ల కిడ్నీలు ఎక్కువ ఒత్తిడికి గురవుతాయి.

దాంతో ఫిల్ట్రేషన్ సరిగా జరగ‌క అనేక‌ సమస్యలు తలెత్తుతాయి.గ్యాస్, అసిడిటీ ఉన్న‌వారు ప‌చ్చ‌ళ్లు తింటే ఆయా స‌మ‌స్య‌లు మ‌రింత తీవ్ర త‌రంగా మార‌తాయి.

గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మ‌రియు తల్లిపాలు ఇస్తున్న మహిళలు ప‌చ్చ‌ళ్లు తిన‌క‌పోవ‌డ‌మే మంచిది.ఇక మిగ‌తా వారు మాత్రం తక్కువగా, జాగ్రత్తగా తింటే పచ్చళ్లు రుచికీ, ఆరోగ్యానికీ మంచివే.

తాజా వార్తలు