కామెడీ కి సరికొత్త నిర్వచనం చాటిచెప్పిన అతి తక్కువ మంది కమెడియన్స్ లో ఒకరు MS నారాయణ( MS Narayana ).ఈయన బ్రహ్మానందం( Brahmanandam ) తో సరిసమానమైన కమెడియన్ అనడం లో ఎలాంటి సందేహం లేదు.
గత దశాబ్దం లో ఈ ఇద్దరి కమెడియన్స్ హవా మామూలు రేంజ్ లో ఉండేది కాదు.కేవలం వీళ్ళు ఉన్నారని తెలుసుకొని థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య లక్షల్లో ఉంటుంది.
కెరీర్ ఆ రేంజ్ పీక్ లో ఉన్నప్పుడు MS నారాయణ చనిపోవడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.ఆయన లేని లోటు స్పష్టం గా తెలుస్తుంది.
ఆయన రేంజ్ కామెడీ టైమింగ్( Comedy timing ) ని పండించే కమెడియన్స్ నేటి తరం లో ఎవ్వరూ లేరు, మరో పక్క బ్రహ్మానందం సినిమాలు చెయ్యడం బాగా తగ్గించేసాడు.ఇప్పుడు ఇండస్ట్రీ లో కామెడీ కరువు బాగా ఉంది.
ఇదంతా పక్కన పెడితే MS నారాయణ నటుడు అవ్వకముందు ఒక గొప్ప రచయిత.ఎన్నో అద్భుతమైన నవలలు రాసాడు ఆయన.

అప్పట్లో ఆయన రాసే నవలలు డైలీ సీరియల్( Daily Serial ) లాగ వార్త పత్రికలలో ఒక స్పెషల్ ఎడిషన్ లాగ వచ్చేది.వాటికి ఎంతో మంచి ఆదరణ దక్కింది.కొన్ని సినిమాలకు కూడా ఆయన రచయితగా పనిచేసాడు.అయితే తనకి ఒక దర్శకుడితో జరిగిన చేదు అనుభవం ని ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు, ఆయన మాట్లాడుతూ ‘కెరీర్ ప్రారంభం లో ఒక డైరెక్టర్ నా దగ్గర కథలు దొబ్బేసి, నా పేరు వెయ్యకుండా తన పేరు వేసుకున్నాడు.
నాకు కోపం వచ్చి ఫుల్ గా తాగేసి అతనితో ఒక రేంజ్ లో పోట్లాడాను’ అంటూ చెప్పుకొచ్చాడు.ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అని యాంకర్ అడగగా ‘ఆ డైరెక్టర్ పేరు నాగేశ్వర రావు అనుకుంట’ అని చెప్పుకొచ్చాడు.
ఆయన పూర్తి పేరు శివ నాగేశ్వర రావు( Shiva Nageswara Rao ), ఈయన గతం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు.

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ చిన్న బిడ్డగా ఉన్న సమయం లో తెరకెక్కిన ‘సిసింద్రీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా ఈయనే, అలాగే రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యం లో తెరకెక్కిన ‘మనీ’ అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు.చాలా కాలం తర్వాత ఆయన ఈ ఏడాది ‘దోచేవారెవరురా’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నారు.ఈయన తెరకెక్కించిన సినిమాలలో ఏ సినిమాకి MS నారాయణ కథ ని నొక్కేసి ఉంటాడు అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
కామెడీ గా కనిపించే MS నారాయణ లో ఇంత మాస్ ఉందా అని ఆయన చెప్పే దాకా ఎవరికీ తెలియదు.మందు అలవాటు చాలా మందికి హాని కలిగిస్తుంది.
కానీ MS నారాయణ విషయం లో మందు ఆయనకీ చాలా సహాయం చేసిందట, ఇలాంటి సందర్భాలలో ఆయనకీ గొడవ పడే ధైర్యాన్ని ఇచ్చింది మందేనట, మామూలుగా ఉన్నప్పుడు తనలో తానే బాధపడేవాడట, కానీ మందు వేసినప్పుడు మాత్రం విశ్వరూపం చూపేవాడట MS నారాయణ.
.







