గుంటూరు కారం మూవీ ఆ తెలుగు సినిమాకి కాపీనా..? గురూజీ ఇక మారడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి కాన్సెప్ట్ తో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించి మంచి గుర్తింపు పొందాయి.ఇలాంటి క్రమంలోనే పాత స్టోరీలనే ఈతరం ట్రెండుకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తూ చాలామంది డైరెక్టర్లు సినిమాలను తీస్తున్నారు దాంతో మంచి సక్సెస్ లు కూడా కొడుతున్నారు.

 Is Guntur Karam Movie A Copy Of That Telugu Movie..? Has Guruji Changed , Trivi-TeluguStop.com

అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )అయితే ముందు వరుసలో ఉంటున్నాడు.

Telugu Aa, Agnyaathavaasi, Allu Arjun, Guntur Kaaram, Inti Guttu, Mahesh Babu, P

ఎందుకంటే నితిన్ తో ఈయన చేసిన అఆ , అల్లు అర్జున్ తో చేసిన అలా వైకుంటపురంలో సినిమాలు రెండు కూడా తెలుగు లో ఓల్డ్ సినిమాల ప్లాట్ పాయింట్ తీసుకొని ఈ తరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తీయడం జరిగింది.ముఖ్యంగా కృష్ణ ,విజయనిర్మల హీరో హీరోయిన్లుగా వచ్చిన మీనా సినిమాని అఆ సినిమా పేరుతో తీయడం జరిగింది.అప్పట్లో వచ్చిన ఇంటిగుట్టు అనే సినిమాని అలా వైకుంఠపురం లో సినిమాగా తీయడం జరిగింది.

 Is Guntur Karam Movie A Copy Of That Telugu Movie..? Has Guruji Changed , Trivi-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా కాపీ అనే విమర్శలు ఎదురుకుంటు వస్తుంది.

Telugu Aa, Agnyaathavaasi, Allu Arjun, Guntur Kaaram, Inti Guttu, Mahesh Babu, P

ఇక దీంతో ఈయనకి గురూజీ అనే పేరు అవసరమా అంటూ చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.కాపీ అనే ముద్ర ప్రస్తుతానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన ఉంది.అయితే గుంటూరు కారం సినిమా( Guntur Kaaram ) కూడా కృష్ణ హీరో గా వచ్చిన ఒక ఓల్డ్ సినిమాకి కాపీగా చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీవర్గాల్లో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి.

ఇక ఇలాంటి క్రమంలో కాపీ సినిమాలు చేసే ఈయనకి గురూజీ అనే పేరుని ఎందుకు తగిలించారంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈయన పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి సినిమా ( Agnyaathavaasi )ఒక స్పేయిన్ మూవీ కి కాపిగా తెరకెక్కింది…ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.

ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ అల్లు అర్జున్ తో తన నెక్స్ట్ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube