తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి మెగా ఫ్యామిలీ మాత్రమే గుర్తుకొస్తుంది.ఎందుకంటే ఈ ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజన్ మంది హీరోలు ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్(Pavan Kalyan) లాంటి హీరో సైతం అటు రాజకీయాలు చేస్తూనే ఇటు సినిమాలు చేసి సక్సెస్ లను సాధిస్తున్నాడు.ఇక ఆ సినిమాలు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలో తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్(Game Changer)సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.అయితే 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 300 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబడడం అనేది రామ్ చరణ్ (Ram Charan) కెరియర్ లోనే భారీ మచ్చగా మిగిలిపోయిందనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఈ సినిమా ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది.ఈ సినిమా ధియేటర్లో ప్లాప్ అయినప్పటికి ఓటిటి లో మాత్రం అనూహ్యమైన విజయాన్ని సాధించిందనే చెప్పాలి.
ఇప్పటికే భారీ వ్యూయర్షిప్ ను సంపాదించుకున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుంది.

మరి ఏది ఏమైనా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే ఒక అత్యుత్తమమైన సినిమాని ప్రేక్షకుల ముందు ఉంచాలి అనుకున్నాడు.కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆ సినిమా తేడా కొట్టింది.కానీ ఓటిటి లో మాత్రం ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కుతుండడం విశేషం.

ఇక సినిమా రిలీజ్ కి ముందు పుష్ప 2 (Pushpa 2) సినిమా రికార్డును కొల్లగొడుతుంది అంటూ అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమా భారీగా ఫెయిల్ అవ్వడంతో రామ్ చరణ్ కొంతవరకు డీలాపడ్డాడు… అయితే బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకొని తన ఫ్యాన్స్ ని అలరించాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.ఇక తను అనుకున్నట్టుగానే ఆ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు.

మరి ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు రామ్ చరణ్ ని ఒక మాస్ యాంగిల్ లో చూపించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాడట.దానికోసమే రామ్ చరణ్ కూడా విపరీతంగా ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.చూడాలి మరి ఈ సినిమాతో అటు బుచ్చిబాబు ఇటు రామ్ చరణ్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…
.







