Allu Arjun : అల్లు అర్జున్ పదే పదే ఆ పని చేయడానికి ఇష్టపడడా.. అందుకే ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వదులుకున్నాడా?

సినీ ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్లు అప్పుడప్పుడు కొన్ని కొన్ని కారణాల ద్వారా మంచి మంచి సినిమాలను వదిలేసుకుంటూ ఉంటారు.డేట్స్ కుదరకపోవడం వల్లనో, సినిమా కంటెంట్ నచ్చకపోవటం వలన లేక అందులో కొన్ని సీన్స్ కు భయపడో సినిమా చేయడానికి ఇష్టపడరు.

 Is Allu Arjun Willing To Do That Again And Again Thats Why He Gave Up That Bloc-TeluguStop.com

కానీ సీన్ కట్ చేస్తే ఆ సినిమాలే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటాయి.

ఇలా చాలా కారణాల వల్ల చాలామంది నటీనటులు( Actors ) మంచి మంచి హిట్ అందుకున్న సినిమాలు వదులుకొని చాలా బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే అల్లు అర్జున్ ( Allu Arjun )కూడా ఒక సినిమాను ఒక కారణంతో వదిలేసుకున్నాడు.అదేంటంటే అందులో ఒక సీన్ తను పదే పదే చేయడానికి ఇష్టపడక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ వదులుకున్నాడు.

ఇంతకు ఆ సినిమా ఏంటి.ఇంతకు ఏ సీన్ కోసం వదులుకున్నాడో చూద్దాం.

Telugu Allu Arjun, Arjun Reddy, Sandeep Reddy, Sneha Reddy-Movie

ప్రస్తుతం బన్నీ పుష్ప( Bunny Pushpa ) సీక్వెల్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారాడు.తాత, తండ్రి వారసత్వంతో అడుగుపెట్టిన అల్లు అర్జున్.ఆ తర్వాత సొంత టాలెంట్ ఉపయోగించి వారి కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు.చిన్న హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ఎన్నో సినిమాలలో చేసి.మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా అందుకొని ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు.

Telugu Allu Arjun, Arjun Reddy, Sandeep Reddy, Sneha Reddy-Movie

ఇక మంచి హోదాలో ఉండగానే స్నేహ రెడ్డి( Sneha Reddy ) అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు.అలా ఒక వైపు ఫ్యామిలీ బాధ్యతలు, మరోవైపు సినిమాలు చేయటమే కాకుండా.ఇంకోవైపు బిజినెస్ లు కూడా నడిపిస్తున్నాడు.చేతినిండా ప్రాజెక్టులతో, చేతినిండా డబ్బులతో లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.

Telugu Allu Arjun, Arjun Reddy, Sandeep Reddy, Sneha Reddy-Movie

అయితే ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ గతంలో తొందరపడి కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలతో బాగా నిరాశ చెందాడు.ఇక కొన్ని వదులుకున్న సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి.అయితే గతంలో ఈయనకు ఒక సినిమాలో అవకాశం వచ్చింది.ఇంతకు ఆ సినిమా ఏదో కాదు విజయ్ దేవరకొండ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన అర్జున్ రెడ్డి( Arjun Reddy ).

అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి( Director Sandeep Reddy ) ముందు ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ ని అనుకున్నాడట.అయితే ఈ సినిమాలో ఎక్కువగా లిప్ లాక్ ఉండటంతో కచ్చితంగా లిప్ కిస్ ఇవ్వాల్సిందే అంటూ డైరెక్టర్ కండిషన్ పెట్టడంతో వెంటనే బన్నీ ఇలా పదేపదే కిస్ చేయటం వల్ల తన ఇమేజ్ ఎక్కడ డామేజ్ అయిపోతుందో అని అప్పుడే ఈ సినిమాకు నో చెప్పేసాడట.

ఆ తర్వాత శర్వానంద్ దగ్గరికి కూడా వెళ్లి ఈ కథ వినిపించి ఆ కండిషన్ చెప్పాడట సందీప్ రెడ్డి.ఆయన కూడా అదే కారణంతో నో చెప్పాడట.

ఇక చివరిగా విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళగా ఆయన ఓకే అనటంతో ఆ సినిమాతో ఆయన ఓవర్ నైట్ స్టార్ గా మారాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube