జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.ఆయన ఎప్పుడు ఎలాంటి ప్రకటనలు చేస్తారో అంతుచిక్కక ఇతర పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
నిన్న మొన్నటి వరకు బీజేపీతో మాత్రమే తమ పొత్తు కొనసాగుతుందని చెబుతూ వచ్చిన పవన్.చంద్రబాబు జైలుకు వెళ్ళిన తరువాత టీడీపీతో( TDP ) పొత్తును కన్ఫర్మ్ చేసి కొత్త చర్చకు దారి తీశారు.
ఇదే టైమ్ లో తాము ఎన్డీయే కూటమిలో భాగమేనని కూడా చెప్పుకొచ్చారు.దీంతో పవన్ రెండు పడవల ఆట అర్థం కాక బీజేపీ పార్టీ( BJP party ) నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎందుకంటే పవన్ దోస్తీ కట్టిన టీడీపీ ఎన్డీయే కూటమిలో లేదు.

దాంతో ఆ పార్టీకి బీజేపీ కూడా దూరంగా ఉంటూ వస్తోంది.అయితే పవన్ అనూహ్యంగా టీడీపీతో పొత్తు ఎందుకు ప్రకటించినట్టు అని కమలనాథులను ఇటు సామాన్యులను వేధిస్తున్న ప్రశ్న.దీనికి సమాధానం దొరకాలంటే జైల్లో చంద్రబాబు ( Chandrababu )పవన్ తో ఏం చర్చిందారనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.
కాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం టీడీపీ బాధ్యతలన్నీ చంద్రబాబు పవన్ భుజలపైనే వేశారట.అంతే కాకుండా ఇరు పార్టీల ఉమ్మడి సిఎం అభ్యర్థిగా పవన్ ఉండడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
అందుకే పవన్ చంద్రబాబుతో జరిగిన మూలాఖత్ తరువాత వెంటనే పొత్తును కన్ఫర్మ్ చేశారని టాక్.ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉండడంతో టీడీపీలో నాయకత్వ లోటు ఉంది.

చంద్రబాబు తనయుడు నారాలోకేష్( Naralokesh ) ప్రస్తుతం యాక్టివ్ గానే ఉన్నప్పటికి ఆయన నాయకత్వంపై సొంత పార్టీ నేతలే నమ్మే పరిస్థితి లేదు.ఇక నందమూరి బాలకృష్ణ కూడా ప్రస్తుతం పార్టీలో చురుకుగా కనిపిస్తున్నప్పటికి పార్టీని లీడ్ చేసే సత్తా ఆయనకు లేదని చంద్రబాబే భావిస్తున్నారట.అందుకే టీడీపీని ముందుండి నడిపే బాధ్యతను పవన్ పై ఉంచరాట చంద్రబాబు.ప్రస్తుతం టీడీపీ విషయంలో పవన్ చొరవ చూస్తుంటే నిజమేనేమో అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు.
ప్రస్తుతం ఇరు పార్టీల మద్య బంధం బలోపేతం చేయడానికి పవన్ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.అటు టీడీపీ కూడా అదే ఆలోచనలో ఉంది.దాంతో ఈ పరినమలన్నీ చూస్తుంటే పవన్ టీడీపీని లీడ్ చేస్తునట్లు తెలుస్తోందని కొందరు రాజకీయ వాదులు చెబుతున్నారు.
