ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ పార్టీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ టాపిక్ మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి.ఎవరు ఇద్దరు చేరుకున్న కానీ ఇదే చర్చ నడుస్తోంది.
ఎవరికి మంత్రి పదవులు వస్తాయి.ఎవరికి రావు అనే విషయం మీద ఎవరికి తోచినట్లు వారు ఊహాగానాలు అల్లుకుంటున్నారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు కానీ చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా చర్చల్లో ఉంటుంది.
ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఏపీకి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశాడు.తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
కానీ తెలుగు దేశం పార్టీ పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డిని సరిగ్గా ట్రీట్ చేయడం లేదని ఆయన అనుచరులు భావించారు.టీడీపీ నుంచి బయటకు రావాలని విన్నవించుకున్నారు.
ఇక తన వర్గీయులు చెప్పడంతో చేసేదేం లేక 2019 ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరారు.ఇంకా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వైసీపీ పార్టీలో చేరినా కానీ వైసీపీ పార్టీ మాత్రం ఆనం సీనియారిటీని గౌరవించింది.
ఆయనకు నెల్లూరులోని వెంకటగిరి సీటును జగన్ ఆఫర్ చేశారు.

ఇక ఈ సీటు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి చాలా ఈజీగానే విజయం సాధించారు.నెల్లూరులో ఆనం ఫ్యామిలీ అంటే ఒక విధమైన పొలిటికల్ మైలేజ్ ఉండడంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అయింది.ఇక అప్పటి వరకు వెంటకగిరి స్థానం తనకే వస్తుందని ఆశ పెట్టుకున్న ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు రాంకుమార్ రెడ్డికి నిరాశే ఎదురైంది.
కానీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆనంకు జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు.కానీ ఇప్పుడు జరిగే మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ పదవి లభిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది.







