తిరుపతి జిల్లా పుత్తూరులో టిడ్కో ఇళ్లను మంత్రి రోజా పరిశీలించారు.ఈ క్రమంలోనే రూ.4.5 కోట్లతో టిడ్కో ఇళ్ల ఆధునీకరణ పనులను ఆమె ప్రారంభించారు.
టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా నిర్మించారని మంత్రి రోజా తెలిపారు.టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఉంటే లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు.జన్మభూమి కమిటీల పేరుతో ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని రోజా ఆరోపించారు.త్వరలో టిడ్కో ఇళ్ల ఆధునీకరణ పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు.
టీడీపీ అసత్యాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న మంత్రి రోజా పేదలకు ఇళ్లు అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని తెలిపారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.