పుట్టిన ఏడాదిన్నరకే నాన్న మరణం.. బుక్స్ కు డబ్బుల్లేవు.. నిర్మల సక్సెస్ స్టోరీకి గ్రేట్ అనాల్సిందే!

Ips Nirmala Devi Inspirational Success Story Details,ips Nirmala Devi, Inspirational Story, Nirmala Devi Success Story , Cbi Nirmala Devi, Upsc 272 Ranker, Civils Exam, Cbi , Cbi Officer, Coimbatore

మనలో చాలామంది నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించామని ఫీల్ అవుతుంటారు.అయితే కొంతమంది అనుభవించిన కష్టాలతో పోల్చి చూస్తే మన కష్టాలు అసలు కష్టాలే కాదని అనిపిస్తాయి.

 Ips Nirmala Devi Inspirational Success Story Details,ips Nirmala Devi, Inspirat-TeluguStop.com

సీబీఐలో( CBI ) పెద్ద ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న నిర్మల( Nirmala ) డిపార్టుమెంట్ లో సూపర్ కాప్ గా పేరు సంపాదించుకున్నారు.అమ్మ వల్లే నేను కెరీర్ విషయంలో సక్సెస్ అయ్యానని నిర్మల చెబుతున్నారు.

నేను సీబీఐ ఆఫీసర్ కావడం వెనుక అమ్మ కష్టం ఎంతో ఉందని ఎన్నో అడ్డంకులను అధిగమించి అమ్మ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారని నిర్మల అన్నారు.మా నాన్న రైతు అని నేను పుట్టిన ఏడాదిన్నరకే నాన్న మరణించాడని ఆమె తెలిపారు.

నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో( UPSC ) నేను సక్సెస్ సాధించానని నిర్మల చెప్పుకొచ్చారు.నిర్మల పూర్తి పేరు నిర్మలాదేవి( Nirmala Devi ) కాగా కోయంబత్తూరులోని( Coimbatore ) అలందురై గ్రామంలో ఆమె జన్మించారు.

అమ్మ పొలానికి వెళ్లి పని చేసేవారని రాత్రి సమయంలో పొలానికి నీరు పెట్టడానికి వెళ్లేవారని నిర్మల వెల్లడించారు.డిగ్రీ పూర్తైన వెంటనే బ్యాంక్ జాబ్ వచ్చిందని నా ఉద్యోగం అమ్మకు సంతృప్తిని ఇవ్వకపోవడంతో యూపీఎస్సీపై దృష్టి పెట్టానని ఆమె చెప్పుకొచ్చారు.యూపీఎస్సీ పరీక్షలకు పుస్తకాలు కొనడం కూడా భారంగా మారిందని నిర్మల కామెంట్లు చేశారు.నాలుగో ప్రయత్నంలో 272వ ర్యాంక్ వచ్చిందని నిర్మల అన్నారు.

2016 సంవత్సరంలో అమ్మ మాకు దూరమైందని అమ్మను రోజూ తలచుకుంటామని నిర్మల కామెంట్లు చేశారు.ఐపీఎస్ ఆఫీసర్ నిర్మలాదేవి( IPS Nirmala Devi ) చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.తల్లి కలను నిజం చేసిన నిర్మలాదేవి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాలి.నిర్మలాదేవి టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube