త్వరలో IPL మినీ ఆక్షన్.. ఒక్కో జట్టు వద్ద ఎంత డబ్బు ఉందంటే!

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న IPL 23 గురించి రోజుకో వార్త వచ్చి వీనులవిందు చేస్తోంది.అవును, తాజాగా IPL 23 మినీ ఆక్షన్కు రంగం సిద్ధం చేసుకుంటోంది.

 Ipl Mini Auction How Much Money Each Team Has-TeluguStop.com

డిసెంబర్ 16న బెంగుళూరులో ఈ మినీ వేలం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ ఆక్షన్ BCCI సర్వసభ్య సమావేశం అనంతరం.

IPL గవర్నింగ్ మండిలి భేటీ అయి తుది నిర్ణయం తీసుకోనుంది.గతంలో IPL జట్టుకు రూ.90 కోట్లు ఖర్చు చేసే అవకాశముండేది.కానీ ఇప్పుడు ఆ సాలరీ పర్స్ విలువను రూ.5 కోట్లు పెంచి రూ.95 కోట్లు చేయడం జరిగింది.

ఇకపోతే 2024లో జరగబోయే IPL టీమ్ సాలరీ పర్స్ విలువ రూ.100 కోట్లు వరకు ఉండబోతోందని సమాచారం.ఇక ఫ్రాంచైజీల అంతర్గత కొనుగోళ్లు, ఆటగాళ్ల మార్పిడుల ప్రకారం.జట్టు సాలరీ పర్స్ పెరగడం, తగ్గడం అనేది ఉంటుంది.సదరు ఆక్షన్ డిసెంబర్ 16న జరిపేందుకు వీలు లేకపోతే మరో తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.దానితోపాటు ICC ఛైర్మన్‌ పదవి విషయం గురించి AGM వార్షిక సర్వసభ్య సమావేశంలో BCCI చర్చించనుంది.

సౌరభ్‌ గంగూలీ స్థానంలో BCCI నూతన అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నాడు.

BCCI నుంచి సౌరభ్‌ గంగూలీ నిష్క్రమణపై పెద్ద దుమారమే రేగుతోంది.

Telugu Anurag Thakur, Bcci, Ipl, Latest, Roger Binny, Saurabh Ganguly, Ups-Sport

క్రీడా వర్గాల్లోనే కాకుండా రాజకీయంగానూ ఈ విషయం హాట్ టాపిక్ అయింది.ICC పదవికి గంగూలీని అనుమతివ్వాలంటూ ప్రధాని మోదీకి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే.ఐసీసీ పదవికి బోర్డు పోటీపడితే క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లేదా BCCI మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే IPL ఛైర్మన్‌ పదవిని అరుణ్‌ ధుమాల్‌ స్వీకరించనున్నాడు.

ICC పదవికి పోటీపడాలా లేదా ప్రస్తుత ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లేకు రెండో దఫా మద్దతు తెలపాలా అన్న విషయంపై బోర్డు చర్చించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube