లోయలో పడిపోయిన వ్యక్తి... కాపాడిన ఆపిల్ ఐఫోన్.. సిగ్నల్, వై-ఫై కూడా లేదు మరి!

ఆపిల్ ఐఫోన్( Apple iPhone ) గురించి ప్రపంచ జనులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.విశ్వ వ్యాప్తంగా ఆ గాడ్జెట్ కి అభిమానులు వున్నారు.

 Iphone 14 Helps Man Get Rescued After Driving Car Off Cliff In Los Angeles Detai-TeluguStop.com

ఈ క్రమంలో వచ్చిన ఐఫోన్ 14( iPhone 14 ) రక్షకుడిగా మారిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.లాస్ ఏంజెల్స్( Los Angeles ) సమీపంలో జరిగిన ఓ ఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విషయం ఏమిటంటే, మౌంట్ విల్సన్ ప్రాంతంలో పయనిస్తున్న ఓ వ్యక్తి కారు ప్రమాదవశాత్తు 400 అడుగుల లోయలో అమాంతం పడిపోయింది.అయితే అదృష్టవశాత్తు ఐఫోన్ 14 ఫీచర్లు అతన్ని రక్షించాయి అంటే మీరు నమ్ముతారా?

నమ్మాల్సిందే… ఈ ఐ ఫోన్ ఫీచర్లలో క్రాష్ డిటెక్షన్ అండ్ సాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOS ఉన్నాయి.ఇలాంటప్పుడు ఫోన్ ఎలా వర్క్ చేస్తుందంటే… మొదట, ఐఫోన్ 14 కారు ప్రమాదం( Car Accident ) సంభవించిందని ఆటోమేటిక్ గా పసిగడుతుంది.వ్యక్తికి వీలైనంత త్వరగా సహాయం అందించడంలో ఈ క్విక్ డిటెక్షన్ అనేది చాలా కీలకమైనది.

ఇక రెండవది శాటిలైట్ కనెక్షన్‌ని ఉపయోగించి ఫోన్ ఎమర్జెన్సీ రిలే కేంద్రానికి టెక్స్ట్ మెసేజ్ పంపిస్తుంది.కారు క్రాష్ అయిన ప్రాంతంలో వై-ఫై కవరేజ్ లేదు, కానీ శాటిలైట్ కనెక్షన్‌తో మెసేజ్ త్వరగా పంపబడింది.

ఈ విధంగా ప్రమాదం జరిగిన సరైన స్థలం కనుగొన్నారు.ఈ సమాచారంతో లోయలో ఉన్న వ్యక్తిని ఎమర్జెన్సీ రెస్పాండర్లు గుర్తించగలిగారన్నమాట.

సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లో ఒకరైన స్టీవ్ గోల్డ్‌స్వర్తీ ఈ విషయం మీద మాట్లాడుతూ… ఐఫోన్ సహాయం లేకుండా సదరు వ్యక్తిని కనుగొనడం ఒక సవాలుగా మారేదని అన్నారు.కారులో వున్న మరొక వ్యక్తికి గాయాలు తీవ్రంగా ఉన్నాయని, అతన్ని సకాలంలో రక్షించకపోతే అతను బతికేవాడు కాదని పేర్కొన్నాడు.ఇకపోతే అన్ని iPhone 14 మోడల్‌లలో క్రాష్ డిటెక్షన్ డిఫాల్ట్ ఫీచర్‌గా( Crash Detection ) వస్తుందనే విషయం అందరికీ తెలిసినదే.స్మార్ట్‌ఫోన్‌లలోని ఇటువంటి ఫీచర్‌లు క్లిష్ట పరిస్థితుల్లో కూడా చాలా బాగా వర్క్ చేస్తాయి.

ఇంకా కమ్యూనికేషన్ సిస్టం అందుబాటులో లేనప్పుడు జీవితాలను కాపాడతాయి కూడా.ఇలాంటి సంఘటనల తరువాత ఐఫోన్ మరింత ప్రజాదరణ పొందుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

iPhone 14 Helps Man Get Rescued After Driving Car Off Cliff

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube