వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ వేగవంతంగా విచారణ చేస్తూ ఉంది.ఇప్పటికే కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రెండుసార్లు విచారణకు హాజరయ్యారు.
పరిస్థితి ఇలా ఉంటే నేడు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో మూడోమారు అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనుంది.విచారణకు సంబంధించి నోటీసు ఇచ్చిన సమయంలో తాను రాలేనని అవినాష్ రెడ్డి చెప్పగా కచ్చితంగా రావాలని…సీబీఐ స్పష్టం చేయడం జరిగింది.
మరోవైపు ఇదే రోజు కడప సీబీఐ కార్యాలయంలో వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.దీంతో తండ్రి కొడుకులను ఒకేసారి వేరువేరు చోట్ల సీబీఐ విచారణ చేస్తూ ఉండటం సంచలనం రేపింది.
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఇప్పటికే జనవరి 28న తొలిసారి.ఫిబ్రవరి 24వ తారీఖున రెండోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
కాగా మూడోసారి విచారణకి హాజరుకావలనీ సీబీఐ అధికారులు స్వయంగా పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు కొద్ది రోజుల క్రితం జారీ చేయడం జరిగింది.







