మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మధ్యాహ్నం 3.45కి వాయిదా వేసింది.
ఈ క్రమంలోనే అరెస్ట్ చేయకుంటే విచారణకు హాజరు అవుతారని అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది వెల్లడించారు.
ఈ క్రమంలో ఈనెల 30వ తేదీ లోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని సీబీఐ తెలిపింది.దీంతో ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణకు హాజరు అయ్యేందుకు సీబీఐ కార్యాలయానికి బయలుదేరారు.







