టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను సాధించిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాను గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తు్న్నారు.
ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా పూర్తి సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా రానుండటంతో ఈ సినిమాలో ఎలాంటి అంశాన్ని చూపిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో సర్కారు వారి పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఓ బ్యాంక్ మేనేజర్ కొడుకుగా కనిపిస్తాడని తెలుస్తోంది.
కాగా ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఓ భారీ బ్యాంక్ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు చిత్ర యూనిట్.ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఈ సెట్‌లో చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే ఈ సినిమాకు చాలా కీలకమైన ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను కూడా ఈ సెట్స్‌లోనే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ప్రెస్టీజియస్ మూవీగా చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ చాలా అద్భుతంగా ఉండబోతుందని, ఈ సీక్వెన్స్‌కు సంబంధించిన 15 నిమిషాలు సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తాయని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురఏస్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమా షూటింగ్‌ను జనవరి నెల నుండి నిర్విరామంగా నిర్విహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరి ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy