ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయ్ కత్రినా అనుకుంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్టే?

సాధారణంగా ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతుంటారు.ఈ క్రమంలోనే మనం ఒకరిద్దరిని ఒకే పోలికలతో ఉన్న వారిని చూసి ఉంటాం.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు అచ్చం వారి పోలికలతో ఉన్నటువంటి వారిని ఎంపిక చేసుకొని హీరో హీరోయిన్లకు డూప్ గా పెట్టడం మనం చూస్తుంటాము.ఇలా ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది సినీ తారలకు వారి పోలికలతో ఉన్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడం వల్ల ఈ విధంగా సెలబ్రిటీల పోలికలతో ఉన్న వారు బయట పడుతున్నారు.ఇప్పటికే సమంత, ఐశ్వర్యారాయ్, త్రిష, వంటి సెలబ్రిటీల పోలికలతో ఉన్న వారిని మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పోలికలతో అచ్చం ఈ ఫోటోలో ఉన్నది కత్రినాకైఫ్ అన్నట్టుగా కత్రినాకైఫ్ పోలికలతో ఉన్నటువంటి ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆ ఫోటో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కత్రినాకైఫ్ అని భావిస్తారు.

Advertisement
Internet Thrilled Meet Katrina-kaifs Look Like Katrina Kaif, Social Media, Viral

అయితే అందులో ఉన్నది కత్రినాకైఫ్ అనుకుంటే మనం పొరపాటు పడినట్లే.కత్రినా కైఫ్ తన ఫోటోను పక్కన పెడితే వీరిలో రియల్ కత్రినాకైఫ్ ఎవరో కనుక్కోవడం కష్టమనంతగా అలీనా రాయ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఇప్పుడు కత్రినాకైఫ్ పోలికలతో సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.

Internet Thrilled Meet Katrina-kaifs Look Like Katrina Kaif, Social Media, Viral

సోషల్ మీడియా వేదికగా అలీనా రాయ్ తన ఫోటోలను షేర్ చేయడంతో ఇది చూసిన నెటిజన్లు అచ్చం కత్రినాకైఫ్ పోలికలతో ఉందని పెద్ద ఎత్తున ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు.ఈమె ఫోటోను చూసిన వారు ఆ ఫోటోలో ఉన్నది కత్రినా అనక మానరు.అచ్చం అదే పోలికలతో కత్రినాకైఫ్ జిరాక్స్ కాపీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటివరకు మనుషులను పోలిన మనుషులు ఉన్నారని విన్నాము కానీ, అచ్చం ఒక మనిషిని జిరాక్స్ కాపీ చేస్తే ఎలా ఉంటారో అదే పోలికలతో ఉన్న అలీనా రాయ్ ను చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరెందుకు ఆలస్యం కత్రినా పోలికలతో ఉన్న అలీనా గ్లామరస్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు