విశాఖపట్నంలో అంతర్జాతీయ జలవనరుల సంరక్షణ సదస్సు జరిగింది.25వ అంతర్జాతీయ కాంగ్రెస్, 74వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సందర్భంగా ఈ సదస్సును నిర్వహించారని తెలుస్తోంది.
ఈ సదస్సుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సీఎం జగన్ తో పాటు మంత్రులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని చెప్పారు.
ఏపీలో సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉందన్న సీఎం జగన్ ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడమే లక్ష్యమని తెలిపారు.
రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోందన్నారు.వర్షం కురిసేది తక్కువ కాలమేనన్న ఆయన ఆ నీటిని సంరక్షించుకొని వ్యవసాయానికి వాడుకోవాలని తెలిపారు.