ప్రవాస విద్యార్ధులకు బ్రిటన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది.ముఖ్యంగా ఈ వార్త భారతీయ విద్యార్ధులకు భంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
ఇంతకీ ఏంటా ఆఫర్ అనుకుంటున్నారా.విదేశీ విద్యార్ధులు ఎవరైనా సరే బ్రిటన్ వెళ్ళినప్పుడు బ్రిటన్ లో ఉండేందుకు అక్కడ చదువుకునేందుకు అన్ని అర్హతలను, పర్మిషన్లు తీసుకుని వెళ్తారు.
అయితే వీటన్నిటితో పాటు తప్పనిసరిగా వారు ఉండే ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లో వారి వివరాలు, ఎక్కడి నుంచీ వచ్చారు, వారు ఎక్కడ ఉంటున్నారు, ఏ కాలేజిలో చదువుతున్నారు అనేటువంటి అన్ని వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి.అలాగే ఈ నమోదు ప్రక్రియలో భాగంగా కొంత డబ్బును చెల్లించాలి కూడా…అయితే
బ్రిటన్ తాజాగా ఈ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఎన్నో ఏళ్ళ నుంచీ కొనసాగుతున్న ఈ విధానం పట్ల విదేశీ విద్యార్ధులు అసంతృప్తి గా ఉన్నారని అలాగే ఈ విధానంలో మార్పులు అవసరమని భావించిన ప్రభుత్వం తాజాగా ఈ విధానానికి స్వస్తి చెప్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.6 నెలలకు మించి బ్రిటన్ లో ఉండే వారు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ లో వివరాలు నమోదు చేసుకోవాలనేది అక్కడి నియమం.ఈ నియమాన్ని ఆగస్టు 4 నుంచే బ్రిటన్ ఎత్తేసింది.

బ్రిటన్ హోమ్ కార్యాలయం ఓ ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది, అలాగే ఇప్పటికే పోలీసులకు తమ వివరాలు అందజేసిన విద్యార్ధులు, పోలీసులకు సమాచారం ఇవ్వడానికి సిద్దంగా ఉన్న వారు లేదా యూకేని విడిచి వెళ్లాలని భావించే వారికి కూడా ఈ కొత్త రూల్ వర్తిస్తుందని హోమ్ కార్యాలయం వెల్లడించింది.ఇదిలాఉంటే బ్రిటన్ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది విదేశీ విద్యార్ధులకు సంతోషాన్నిచ్చింది.ముఖ్యంగా భారతీయ విద్యార్ధులకు భంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఎందుకంటే బ్రిటన్ లో అత్యధికంగా భారతీయ విద్యార్ధుల సంఖ్యే ఎక్కువ అంతేకాదు తాజాగా బ్రిటన్ వీసా కోసం వేచి చూస్తున్న వారిలో కూడా భారతీయులే ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.
దాంతో బ్రిటన్ తాజాగా నిర్ణయంతో భారతీయ విద్యార్ధులు లాభపడనున్నారని అంటున్నారు నిపుణులు.







