సర్కారు వారి పాటలో అంత మహేష్ పాత్ర చుట్టూనే.. ఇంట్రెస్టింగ్ అప్డేట్!

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట.

పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ జీ ఎమ్ బీ ఎంటర్టైన్మెంట్ 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఇక ఈ సినిమాకు తమన్ తన సంగీతాన్ని వినిపిస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమాలోని మహేష్ బాబు ఫ్రీ లుక్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇందులో కీర్తి సురేష్ పాత్ర హైలెట్ గా ఉంటుందని సమాచారం.

ఈ సినిమా బ్యాంకింగ్ రంగాల వ్యవస్థలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కనుంది.ఇక ఇందులో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ గా, కీర్తి సురేష్ అదే బ్యాంకులో పనిచేసే ఉద్యోగినిగా కనిపించనుంది.

Advertisement
Mahesh Babu Sarkaaru Vaari Paata Interesting Update, Mahesh Babu, Sarkaru Vari P

ఇదిలా ఉంటే ఈ సినిమా మొత్తం మహేష్ బాబు పాత్ర చుట్టూ కామెడీ ట్రాక్ ఉంటుందని తాజా అప్ డేట్ లో తెలిసింది.ఈ సినిమాలో పరశురాం ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కామెడీ ట్రాక్ ను కూడా రాశాడట.

Mahesh Babu Sarkaaru Vaari Paata Interesting Update, Mahesh Babu, Sarkaru Vari P

ఇందులో బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ కూడా నటిస్తుండగా.వీరి మధ్య కామెడీ నడుస్తుందని, ఈ కామెడీ ట్రాక్ సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.ఇక ఈ కామెడీ మొత్తం సెకండ్ హాఫ్ లో రావడంతో పాటు.

మొత్తానికి మహేష్ పాత్ర చుట్టూ ఈ కామెడీ తిరుగుతుందని తెలిసింది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు లవర్ బాయ్ గా కనిపించనున్నాడని టాక్.

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వరుస ప్రాజెక్టులకు సైన్ చేసిన సంగతి తెలిసిందే.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు