సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత హీరో హీరోయిన్లకు ఎత్తు పల్లాలు ఉండడం సర్వసాధారణం.ఒక సినిమా హిట్ అయితే సంబరపడేవారు మరొక సినిమా ఫ్లాప్ అయితే బాధపడేవారు ఎప్పటికీ నిజమైన హీరోలు కాదని అనిపించుకుంటారు.
అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా అందులో తమ క్యారెక్టర్ ను ప్రేమిస్తూ ముందుకు సాగే వారే నిజమైన సినీ హీరోలని సినిమా ప్రేమికులని చెప్పాలి.ఇలా సినిమా విజయం ఎలా ఉన్నా ఒకే విధంగా ఆ సినిమా ఫలితాన్ని అందుకునే వారిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు.

ఎలాంటి సినీబ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నటువంటి చిరంజీవి నేడు ఇండస్ట్రీకి పెద్దగా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.ఇలా ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి ఓ సినిమా పేరు వింటే ఇప్పటికి తనకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయని ఆ సినిమా గురించి పలు సందర్భాలలో చిరంజీవి తెలియచేశారు.మరి చిరంజీవిని అంతగా భయపెట్టిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాధా (Radha) భానుప్రియ (Bhanu Priya) హీరో హీరోయిన్లుగా 1989 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం స్టేట్ రౌడీ(State Rowdy).ఈ సినిమా విడుదలైన మొదట్లో అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.అప్పటివరకు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమా ఒక్కసారిగా బ్రేక్ వేసిందని చెప్పాలి.
ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో చిత్ర బృందం ఎంతో అప్సెట్ అయ్యారు కానీ ఈ సినిమా చూసిన తర్వాత కొందరు ఈ సినిమా పట్ల ప్రశంశలు కురిపించారు.దీంతో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడగా కేవలం మౌత్ టాక్ ద్వారానే పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
ఇలా మొదట్లో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని అనంతరం సక్సెస్ అయినటువంటి ఈ సినిమా అంటే చిరంజీవికి కొన్నిసార్లు భయం వేస్తుందని ఈ సినిమా పేరు వింటే గుండెల్లో రైళ్లు పరిగెడతాయంటూ తెలియజేశారు.