ఎంజీఆర్ మూడో భార్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ కు ముగ్గురు భార్యలు.ఆయన చనిపోయాక మూడు వారాల పాటు తమిళనాడు సీఎం బాధ్యతలు నిర్వహించింది ఆయన భార్య జానకి.

1987లో ఎంజీఆర్ చనిపోగా.జానకి 1996లో కన్నుమూసింది.

ఎంజీఆర్ కు జానకి మూడో భార్య.అయితే జానకికి ఎంజీఆర్ రెండో భర్త అని చాలా మందికి తెలియకపోవడం విశేషం.అసలు జానకి పేరు కూడా వైక్కం నారాయ‌ణియ‌మ్మ జాన‌కి.1923లో కేర‌ళ‌లోని ఓ త‌మిళ నాయ‌ర్ కుటుంబంలో ఆమె జన్మించింది.తన తండ్రి సినీ గేయ‌ ర‌చ‌యిత.

అందుకే చిన్నప్పటి నుంచే తనకు సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండేది.సినిమాల్లో నటించాలనే ఇష్టంతో మద్రాసుకు వచ్చింది.

Advertisement
Interesting Facts About Mgr Third Wife, Mgr Third Wife, Mgr, Jayalalitha, Vaikka

నవాబ్ రాజమాణిక్యం నాటక సంస్థ నిర్మించిన ఇవ్వసాగరం సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.అప్పుడు తన వయసు కేవలం 13 ఏండ్లు.

అయితే ఈ సినిమా షూటింగ్ అయ్యాక.అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదంతో ఆ సినిమా రీల్స్ కాలిపోయాయి.

ఆ తర్వాత కృష్ణ‌న్ తూడు అనే సినిమాలో అవకాశం వచ్చింది.అదే సమయంలో ప్ర‌గ‌తి స్టూడియోలో మేక‌ప్‌మేన్‌గా ఉంటూ స‌హాయ‌పాత్ర‌లు ధ‌రించిన గ‌ణ‌ప‌తి భ‌ట్‌ను ఆమె వివాహం చేసుకుంది.

వారికి ఓ బాబు పుట్టాడు.పెళ్లి తర్వాత కూడా తను సినిమాలు చేసింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Interesting Facts About Mgr Third Wife, Mgr Third Wife, Mgr, Jayalalitha, Vaikka
Advertisement

అదే సమయంలో ఎంజీఆర్ మొదటి భార్య చనిపోయింది.దీంతో ఆయన స‌దానంద‌వ‌తిని రెండో వివాహం చేసుకున్నారు.ఆమె ఆరోగ్యం కూడా సరిగా ఉండేది కాదు.

అప్పుడు ఎంజీఆర్ తో కలిసి జానకి పలు సినిమాలు చేసింది.ఇదే సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది.

కొంత కాలం తర్వాత తన రెండో భార్య కూడా చనిపోయింది.దీంతో జానకిని మూడో వివాహం చేసుకున్నాడు.

అప్పటికే జానకి తన మొదటి భర్తతో విడిపోయింది.ఎంజీఆర్ మరణం తర్వాత తను తమిళనాడు నాలుగో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టింది.

కేవలం 24 రోజుల పాటు సీఎంగా పనిచేసింది జానకి.ఆ తర్వాత ఆమె ప్రభుత్వం పడిపోయింది.

దానికి కారణం జయలలిత కావడం విశేషం.

తాజా వార్తలు