భూత ప్రేతాలను హనుమంతుడు సంహరిస్తాడని ఎందుకంటారో తెలుసా..!

మన మనసులో ఏదైనా అలజడి భయం కలిగినప్పుడు మొదటగా అందరు"శ్రీఆంజనేయం_ప్రసన్నాంజనేయం" అనే మంత్రాన్ని ముందుగా చదువుతారు.

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ మంత్రాన్ని పలు సార్లు చదవటం మనం చూస్తూనే ఉంటాం.

ఈ విధంగా ఆంజనేయ మంత్రం చదవడం వల్ల భూతప్రేతాల నుంచి మనల్ని కాపాడుతాడని భావిస్తారు.ఈ మంత్రం చదవడం వల్ల ఎలాంటి పిచాచులు మన దగ్గరకు రావు అనే భావన అందరిలోనూ ఉంటుంది.

దీనికి గల కారణం పూర్వం హనుమంతుడు ఎంతో మంది రాక్షసులను సంహరించాడు.అదేవిధంగా త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు తనువు చాలించే సమయంలో హనుమంతుడు పక్కన ఉండగా సాక్షాత్ యమధర్మరాజు కూడా శ్రీరాముని ప్రాణాలు తీయడానికి రాముడి దరిదాపుల్లోకి రాలేక పోయాడు అని చెబుతారు.

ప్రస్తుతం మనం ఏదైనా భూతాలు, దయ్యాల భయం ఉన్నప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్తోత్రాన్ని చదువుతారు.ఈ విధంగా చదవడానికి గల కారణం ఏమిటంటే.

Advertisement
Hanuman, Ghosts, Sri Rama, Tretayugam, Un Known Facts About Lord Hanuman, Sri Ra

పురాణాల ప్రకారం శ్రీరాముడికి నమ్మినబంటుగా హనుమంతుడు ఉంటాడు.సాక్షాత్తు హనుమంతుని గుండెల్లో ఆ శ్రీరామచంద్రునికి గుడికట్టిన భక్తుడు ఆంజనేయులు.

శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసినప్పుడు వారి వెంటే ఉండి సీతాదేవి జాడను కనుగొన్నారు.అదేవిధంగా సుగ్రీవుని రక్షించి, లంకా దహనం చేసి రామనామం ఎంతో మధురమైనదని సమస్త లోకాలకు తెలియజేశాడు.

Hanuman, Ghosts, Sri Rama, Tretayugam, Un Known Facts About Lord Hanuman, Sri Ra

త్రేతాయుగంలో రాముడు అవతారాన్ని చాలిస్తూ శ్రీరామచంద్రుడు హనుమంతుడితో ఈ విధంగా చెప్పాడు"కలియుగం అంతమయ్యేవరకు భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడమని, భయాలూ, ఆందోళనల నుండి రక్షించమని, భూత, ప్రేత, పిశాచాల్లాంటి బాధలు, భయాల నుండి బయట పడేయమని, ఆర్తజన రక్షకుడిగా ఉండమని"శ్రీరామచంద్రుడు హనుమంతుడు తెలియజేశాడు.శ్రీరామచంద్రుడి ఆజ్ఞను శిరసావహించిన ఆంజనేయుడు ప్రస్తుత కలియుగంలో ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చి ఆంజనేయ స్వామిని వేడుకున్న వారి ఆపదలను విని వారిని ఆపదల నుంచి తన భక్తులను రక్షిస్తున్నారు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు