క్షేత్రపాలకుడు అంటే ఎవరు.. ఆలయ దర్శనానికి క్షేత్రపాలకుడి అనుమతి అవసరమా..?

మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.ఈ విధంగా ప్రసిద్ధి చెందిన ప్రతి దేవాలయానికి కూడా తప్పనిసరిగా క్షేత్రపాలకుడు ఉంటాడు.

పురాణ కథలలో కూడా ఈ క్షేత్ర పాలకుడు గురించి ఎన్నో సార్లు వినే ఉంటాము.అసలు ఈ క్షేత్రపాలకుడు అంటే ఎవరు? అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు.క్షేత్రపాలకుడు అంటే ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

క్షేత్రపాలకుడు అంటే ఆలయాన్ని పరిరక్షిస్తూ, రక్షణ కల్పించే వాడని అర్థం.ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు తప్పనిసరిగా క్షేత్రపాలకుడు ఉంటాడు.

శివాలయంలో ఆగ్నేయ దిక్కున క్షేత్రపాలకుడు ఆలయం ఉంటుంది.ఆలయాన్ని దర్శించిన భక్తులు ముందుగా క్షేత్రపాలకుని దర్శనం చేసుకున్నాక స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలి.

Interesting Facts About Kshetra Palakudu, Kshetra Palakudu, Shiva Temple, Veerab
Advertisement
Interesting Facts About Kshetra Palakudu, Kshetra Palakudu, Shiva Temple, Veerab

ఆలయంలో ఉన్న పురోహితులు పూజా కార్యక్రమాల అనంతరం తాళాలను వేసి తాళం ఆ ఆలయ క్షేత్ర పాలకునికి ఇవ్వాలి.ఉదయం క్షేత్రపాలకుడు అనుమతి తీసుకుని స్వామివారికి అర్చన కార్యక్రమాలు, మొదలుపెడతారు.క్షేత్రపాలకుడు స్వయానా ఆ పరమేశ్వరుడు వెయ్యవా అంశంగా భావిస్తారు.

లోక రక్షణ కోసం ప్రతి గ్రామంలో ఈశాన్యదిక్కున ప్రత్యేక ఆలయాన్ని నిర్మించి పూజించాలని ఆగమ శాస్త్ర నియమం చెబుతుంది.క్షేత్ర పాలకుడు ఈ ఆలయాలలో నల్లని శరీరం వర్ణంతో, గుండ్రటి కళ్ళు, పొడవైన కేశాలు మెడలో కపాలమాల ధరించి చేతిలో ఆయుధాలను పట్టుకొని నగ్నంగా భక్తులకు దర్శనమిస్తుంటారు.

ఈ విధంగా ప్రతి ఆలయానికి క్షేత్రపాలకుడు ఎలాగ ఉంటాడో ప్రతి గ్రామానికి రక్షకుడిగా వీరభద్రుని రూపంలో కొలువై ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు