సినిమా ఇండస్ట్రీలోకి సాధారణంగా సినీ వారసులు ఎంట్రీ ఇస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు.ఇలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ల వారసులు వారసురాలు కొనసాగుతూ అగ్ర హీరోలుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూర్య సైతం సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.అయితే ఈయన ఏమాత్రం తన తండ్రి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు.
సూర్య కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శివకుమార్ కొడుకు అయితే ఆయన తండ్రి ఒక దర్శకుడని, ఆయన సహాయంతో ఇండస్ట్రీలోకి సూర్య రాలేదని చెప్పాలి.సూర్య 18 సంవత్సరాల వయసులో తన డిగ్రీ పూర్తి చేసి అనంతరం ఏం చేయాలో దిక్కు తెలియక ఒక బట్టల దుకాణంలో పనిచేశారట.
ఇలా బట్టల దుకాణంలో పనిచేసినటువంటి ఈయన అనంతరం సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే ఈయన బట్టల దుకాణంలో పనిచేస్తున్నందుకుగాను నెలకు 736 రూపాయల జీతం తీసుకునేవారు ఇదే సూర్య ఫస్ట్ రెమ్యూనరేషన్.
ఇకపోతే సూర్య బట్టల దుకాణంలో రోజుకు 18 గంటల పాటు ఎంతో కష్టపడే వారని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.అయితే ఈయన బట్టల దుకాణంలో పనిచేస్తున్న తర్వాత సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే ఈయన ఆర్టిస్ట్ గా ఎదిగిన తర్వాత కానీ తన తండ్రి ఒక దర్శకుడు అనే విషయం తనకు తెలియలేదని సూర్య వెల్లడించారు.

ఇకపోతే సూర్య తన మొదటి రెమ్యూనరేషన్ తో తన తల్లికి అలాగే తన సోదరికి ఒక అందమైన చీరలను బహుమతిగా ఇచ్చారని తెలిపారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా సూర్య నటించిన సురారైపోట్రు సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్నారు.ఈయన ఈ అవార్డు అందుకోవడంతో ఎంతో మంది ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక సూర్య వ్యక్తిగత జీవితాన్ని కొస్తే ఈయన నటుడు జ్యోతికను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కలరు.ప్రస్తుతం సూర్య పిల్లలు సినిమాలపై ఏమాత్రం ఆసక్తి కనబరచకుండా చదువుపై దృష్టి సారించారు.పెళ్లి కానంతవరకు జ్యోతిక పలు సినిమాలలో నటించినప్పటికీ వివాహమైన తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉండి సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సూర్య తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈయన సినిమాలకు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తుందని చెప్పాలి.