బాలయ్య సినీ కెరీర్ లో 175 రోజుల పాటు ప్రదర్శించబడిన బ్లాక్ బస్టర్ సినిమాలివే?

ఓటీటీల ఎంట్రీతో ప్రస్తుతం పెద్ద సినిమాలు రెండు వారాల పాటు సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడటం కూడా కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.స్టార్ హీరోల సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లైనా ఆ సినిమాలను 50 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించటం కుదరదని థియేటర్ల యజమానులు తేల్చి చెబుతున్నారు.

 Interesting Facts About Balakrishna Movies Which Played 175 Days In Theaters Det-TeluguStop.com

రిలీజైన తర్వాత తక్కువ సమయంలోనే పెద్ద సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది.

అయితే బాలయ్య నటించిన అఖండ సినిమా మాత్రం చిలకలూరిపేటలోని ఒక థియేటర్ లో ఏకంగా 175 రోజుల పాటు ప్రదర్శించబడటం గమనార్హం.

అయితే ఈ సినిమాతో పాటు బాలయ్య నటించిన పలు సినిమాలు సైతం 175 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించబడి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి.బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా కర్నూలు జిల్లాలోని మినీ శివ థియేటర్ లో 1,000 కంటే ఎక్కువ రోజులు ప్రదర్శించబడటం గమనార్హం.

బాలయ్య నటించిన సింహా 175 రోజులకు పైగా పలు థియేటర్లలో ప్రదర్శించబడింది.

Telugu Days Theaters, Aditya, Akhanda, Balakrishna, Lorry, Simha, Simha Legend-M

బాలయ్య నటించిన నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి, భైరవద్వీపం, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, ముద్దుల క్రిష్ణయ్య, మంగమ్మ గారి మనవడు, శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాలు 175 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించబడ్డాయి.

Telugu Days Theaters, Aditya, Akhanda, Balakrishna, Lorry, Simha, Simha Legend-M

ఇలాంటి అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న అతి తక్కువమంది టాలీవుడ్ హీరోలలో బాలకృష్ణ కూడా ఒకరు కావడం గమనార్హం.బాలయ్య తర్వాత సినిమాలతో విజయాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తారేమో చూడాలి.సినిమాసినిమాకు బాలయ్యకు అంతకంతకూ క్రేజ్ పెరుగుతుండగా బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.బాలయ్య తర్వాత ప్రాజెక్టుల డైరెక్టర్ల జాబితాలో గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను ఉన్నారు.

ఈ ముగ్గురు దర్శకులు ప్రస్తుతం సక్సెస్ లో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube