''ఉస్తాద్ భగత్ సింగ్''పై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు షాక్ తప్పదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఈయన మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉండగా సినిమాలను పక్కన పెట్టాడు.

 Interesting Details About Pawan Kalyan Ustaad Bhagat Singh, Ustaad Bhagat Singh,-TeluguStop.com

ఇక ఇప్పుడు మళ్ళీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.ప్రెజెంట్ హరిహర వీరమల్లు సినిమా చేస్తూనే తర్వాత లైనప్ ను సెట్ చేసుకుంటున్నారు పవన్.

మరి ఈ లైనప్ లో పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో కూడా ఉంది.

వీరి కాంబోలో ‘భవదీయుడు భగత్ సింగ్‘ సినిమా రావాల్సి ఉంది.

ఈ సినిమాను గత రెండేళ్ల క్రితం ప్రకటించిన ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.అయితే ఇదే సినిమాను ఇప్పుడు టైటిల్ మార్చి ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ గా ప్రకటించిన విషయం తెలిసిందే.

అఫిషియల్ గా ఈ సినిమా నుండి అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఉన్నారు.

అయితే ఈ సినిమా గురించి తాజాగా ఆర్ట్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయి ఇంట్రెస్టింగ్ విషయాన్నీ షేర్ చేసారు.ఈ సినిమా రీమేక్ సినిమా అని ఈయన క్లారిటీ ఇచ్చేసాడు.ఈ సినిమా తేరీ సినిమాకు రీమేక్ అని ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయి.

కానీ మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.ఇక ఇప్పుడు ఆనంద్ సాయి కూడా రీమేక్ అని చెప్పారు కానీ ఆ రీమేక్ సినిమా పేరు మాత్రం రివీల్ చేయలేదు.

ఇక ఇది రీమేక్ సినిమా అని తెలియడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.ఎందుకంటే రీమేక్ అంటే ఆల్రెడీ అంతా చూసి ఉంటారు కాబట్టి పెద్దగా ఆసక్తి ఉండదు.అయితే హరీష్ శంకర్ మీద ఉన్న నమ్మకం ఉండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా హిట్ అవుతుంది అని ధీమాగా ఉన్నారు.ఎందుకంటే ఇంతకు ముందు దబాంగ్ రీమేక్ నే గబ్బర్ సింగ్ గా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు.

దీంతో ఈ రీమేక్ ను కూడా చాలా మార్పులు చేసి హరీష్ శంకర్ కొత్తగా తెరకెక్కిస్తారు అని భావిస్తున్నారు ఫ్యాన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube