తుంగతుర్తినియోజకవర్గ పరిధిలోని ఎర్రపాడు క్రాస్ రోడ్ నుండి పైన కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ మీరు యం ఎల్ ఏ గారు ఉన్నారు ఆ ధైర్యం తోటే దొడ్డు వడ్లు వేసినం
కూరగాయల మీద 1000 నుండి 1500 ఆదాయం రెండు పశువులు, రెండు బర్లు ఉన్నాయి మంత్రి జగదీష్ రెడ్డికిరైతుకు నడుమ ఆసక్తికరసంభాషణ పైన కేసీఆర్ గారు ఇక్కడ మీరు,యం ఎల్ ఏ గారు ఉన్నారు…ఆ దైర్యంతోటే దొడ్డు వడ్లు వేసినం అంటూ మంత్రి జగదీష్ రెడ్డి తో రైతు సొప్పరి ఏసు పేర్కొన్నారు.శుక్రవారం సాయంత్రం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో స్థానిక శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ తో కలసి మహబూబాబాద్ కు వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో సందర్భంలో క్రాస్ రోడ్ వద్ద పొలుమల్ల కు చెందిన రైతు సొప్పరి ఏసు పొలం నుండి వస్తుండగా మంత్రి జగదీష్ రెడ్డి తన కాన్వాయిని అపి ముచ్చటించారు.
ఇద్దరి నడుమ జరిగిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది.దిగుబాటు పొలాలు అయితే వరి వెయ్యాలి చక్కగా చెలక పొలాలు పెట్టుకుని వరి ఎందుకు వేసినవు అంటూ మంత్రి జగదీష్ రెడ్డి అడిగితే…పైన కేసీఆర్ ఉండు ఇక్కడ మీరు యం ఎల్ ఏ ఉండు ఆ దైర్యంతోటే వేసినం అయ్యా అంటూ ఆ రైతు బదులిస్తుంటే అందరి మధ్య నవ్వులు కురిపించాయి.
పైన కేసీఆర్ సార్ ఉండు అందరూ ఆ దైర్యంతోటే వేస్తున్నారు కానీ అధిక ఆదాయం వచ్చే పంటలు లాభదాయకంగా ఉంటాయి కదా అని మంత్రి చెబుతుంటే అంతే సూటిగా ఏ మాత్రం తడుముకోకుండా కూరగాయలు వేసినం అయ్యా దొండకాయలు,సొరకాయలు,కాకరకాయలు పండించినం రోజుకు 1000 నుండి 1500 సంపా దిస్తున్నాం అయ్యా అంటూ టక్కున సమాధానంచెప్పిండు.
అంతే కాదు రెండు పశువులు,రెండు బర్రెలు కుడా ఉన్నాయి అయ్యా అంటూ మంత్రి జగదీష్ రెడ్డికి సదరు రైతు వివరిస్తుంటే…అయితే ఓ పని చెయ్యి కూరగాయల మీద దృష్టి సారించు పశువులు ఉన్నాయి కదా అరేకరం లో చొప్ప పెట్టు సంవత్సరానికి 8 సార్లు కోసుకోవొచ్చు అంటూ రైతుకు మంత్రికి నడుమ సంభాషణ కొనసాగింది.
స్వరాష్ట్రంలో సుపరిపాలన అంటూ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అప్రతిహత విజయాలతో రెండు మార్లు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రెండెకరాల రైతు అటు వరి ఇటు కూరగాయలు పండిస్తూ ఎంతటి ఆత్మస్థైర్యంగా ఉన్నారో అని చెప్పేందుకు సదరు రైతు తో జరిగిన సంభాషణ కళ్ళకు కట్టినట్లు ఉంది.*
.