మరోసారి తెరమీదకు ఖలిస్తానీ నినాదం..? దేనికి సంకేతం..?

దేశంలో లోక్ సభ ఎన్నికలు దగ్గరికి వస్తుండటంతో.సంఘ విద్రోహ శక్తులు యాక్టివ్ అవుతున్నాయి.

 Intel Agencies Warns Of Khalistani Sleeper Cells Active In Delhi-ncr,intel Ageci-TeluguStop.com

తము అనుకూలమైన పార్టీని గద్దెనెక్కించి.తమ సత్తా చాటాలని చూస్తున్నాయి.

దేశాన్ని సంరక్షించేందకు అటు ఆర్మీతో పాటు ఇటు ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి.దాంతో దేశంలోని చాలా మంది నక్సలైట్లను ప్రభుత్వం తుదముట్టించింది.

అంతే కాకుండా.పంజాబ్ ప్రాంతంలో.

ఖలిస్తాన్ కోసమంటూ.కొందరు సంఘ విద్రోహ శక్తులుగా మారారు.

ఏకంగా అప్పటి ప్రధాన మంత్రి ఆపరేషన్ చేపట్టేలా చేసి.వారిని తుదముట్టించారు.

ఇక ప్రధాని ఇందిరాగాంధీ చేసిన చిన్న తప్పుకు ఆమెప్రాణాలను సైతం కోల్పోయారు.అప్పటి నుంచి ప్రభత్వం ఫోకస్ పెట్టి మరీ ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సభా పీకేశారు.

అంతకు ముందే.విదేశాల్లో సెటిలైన చాలా మంది సిక్కు సోదరుల్లో.

కొందరు ఖలిస్తానీ మద్దతు దారులు విదేశాలకు చెక్కేశారు.అప్పటి నుంచి విదేశలే అడ్డాగా పావులు కదుపుతూ వచ్చారు.

కొన్ని రోజులకు పాకిస్థాన్ అడ్డగా ఉగ్రవాదం కోరలు చాస్తూ వచ్చింది.,

Telugu Graffiti, Intel, Khalistan, Khalistani, Pakistan, Punjab, Delhi-Politics

ఇప్పుడు తాజాగా భారత్ లోకి మరోసారి ఖలిస్తాని ఉగ్రవాదులు అడుగు పెట్టినట్టు ఇంటిలిజెన్స్ సంస్థలు చెబుతున్నాయి.దాంతో ఢిల్లీ, పంజాబ్ ,హర్యానా, చంఢీఘడ్ లాంటి చోట అధికారులు అప్రమత్తమయ్యారు.ఖలిస్తానీ స్లీపర్ సెల్స్ కు చెందిన ఉగ్రవాద నెట్ వర్క్ లు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో యాక్టివ్ గా ఉన్నట్లు తెలిసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రవాద దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించాయి.వికాస్ పురి, జనక్ పురి, పశ్చిమ్ విహార్, పీరా ఘరి తదితర ప్రాంతాల్లో అభ్యంతరకరమైన నినాదాలతో వేసిన గ్రాఫిటీ పెయింటింగ్స్ కుట్రలో భాగం కావచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.

Telugu Graffiti, Intel, Khalistan, Khalistani, Pakistan, Punjab, Delhi-Politics

ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు, గోడలపై రాతలు పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో కనిపించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.ఖలిస్తాన్ పోస్టర్లను పోలీసులు వెంటనే తొలగించారు.అయితే తొలగించిన చోటే ఖలిస్తాన్ వేర్పాటు వాదులు మరోసారి నినాదాలు రాశారు.దీంతో ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు వేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

అంతే కాదు ఢిల్లీలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు తమకు నిధులు వస్తున్నాయి అని పోలీసు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube