ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు శుభవార్త... 'నోట్స్‌' ఫీచర్‌ వచ్చేసింది, ఇదిగో చూడండి!

ప్రపంచ బడా సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్​తో యూజర్లని ఆకట్టుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తూ వుంది.ఈ క్రమంలోనే తాజాగా ‘నోట్స్​’ అనే కొత్త ఫీచర్​తో ముందుకు వచ్చేసింది.

 Instagram Launched Notes Feature For Its Users Details, Instagram, Technology, N-TeluguStop.com

ఇకపై యూజర్స్​ ‘నోట్స్​’తో తమకు నచ్చింది రాసి, ఇతరులతో పంచుకోవచ్చు. ఈ ఇన్​స్టాగ్రామ్​ నోట్స్​ ఫీచర్​.

స్టేటస్​ను పోలి ఉంటుంది.స్టేటస్​ అనేది న్యూస్​ ఫీడ్​లో కనిపిస్తే.నోట్స్​ ఫీచర్​ మాత్రం డీఎంలో ఉంటుంది.24గంటల తర్వాత మనం రాసే నోట్స్​ డిలీట్​ అయిపోతుంది.

కాబట్టి ఇది ఒక స్టేటస్ లాగే పనిచేస్తుందని అర్ధం చేసుకోవచ్చు.ఈ నోట్స్​ ఫీచర్​కు 60 క్యారెక్టర్​ లిమిట్​ కూడా ఉంది.ఇది యూజర్లు గమనించగలరు.సమాచారాన్ని తొందరగా, సింపుల్​గా పంచుకోవడం కోసం ఈ ఫీచర్​ను యూజర్లముందుకు తీసుకొచ్చింది ఇన్​స్టాగ్రామ్​.

అయితే యూజర్ల నుంచి ఈ ఫీచర్​పై మిశ్రమ స్పందన రావడం కొసమెరుపు.కొంతమంది అద్భుతమైన ఫీచర్ అని కొనియాడగా మరికొంతమంది ఇదొక చెత్త ఫీచర్ అని పెదవి విరుస్తున్నారు.

అయితే ఇపుడు ఇన్​స్టాగ్రామ్​ నోట్స్​ ఫీచర్​ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

1: ముందుగా మీ ఇన్​స్టాగ్రామ్​ యాప్​ని అప్డేట్​ చేసుకోవలసి ఉంటుంది.

Telugu Notes, Ups-Latest News - Telugu

2: ఆ తరువాత ఇన్​స్టాగ్రామ్​ యాప్​ని ఓపెన్​ చేయండి.

3: తరువాత డీఎం సెక్షన్​లోకి వెళ్ళాలి.

4: అక్కడ పైన కనిపిస్తున్న ‘యువర్​ నోట్​’పై క్లిక్​ చేయండి.మీకు ఏదైతే రాయాలనుకుంటున్నారో అక్కడ టైప్​ చేయండి.

5: ఫాలోవర్స్​, క్లోజ్​ ఫ్రెండ్స్​.ఎవరికి కనిపిచాలో సెలక్ట్​ చేసుకోండి.

6: ఇపుడు చివరగా షేర్​ బటన్​ ప్రెస్​ చేస్తే.మీ నోట్స్​ షేర్​ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube