కార్మికులకు మజ్జిగ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్.. నెటిజన్లు పొగడ్తల వర్షం..!

ఈసారి వేసవిలో ఎండలో మండిపోతున్నాయి.ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించిపోయాయి.

ముఖ్యంగా ఢిల్లీలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.

ఇలాంటి మండే ఎండల్లోనూ చాలా మంది కార్మికులు బయట పని చేయాల్సి ఉంటుంది.

ఈ కఠినమైన పరిస్థితులను గుర్తించి, సుచి శర్మ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కార్మికులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది.

Instagram Influencer Who Gave Buttermilk To Workers.. Netizens Showered With Com

సుచి శర్మ ఈ తీవ్రమైన వేడి గురించి తెలుసు.అందుకే, ఆమె బటర్ మిల్క్ లేదా మజ్జిగ ప్యాకెట్ల( Buttermilk packets )ను కొని, రాజధాని నగరంలోని ఒక నిర్మాణ స్థలానికి వెళ్ళింది.అక్కడ ఆమె వేడిలో కష్టపడి పని చేస్తున్న కూలీలను కలిసింది.

Advertisement
Instagram Influencer Who Gave Buttermilk To Workers.. Netizens Showered With Com

వారికి బటర్ మిల్క్ ప్యాకెట్లను పంపిణీ చేసింది.ఎంతో కష్టపడుతున్న తమ గురించి ఆలోచించి మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చిన యువతికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

అంతేకాదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే మజ్జిగ తాగుతూ ఎండల నుంచి కాస్త రిలీఫ్ పొందారు.

Instagram Influencer Who Gave Buttermilk To Workers.. Netizens Showered With Com

సుచి శర్మ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దృశ్యాలను వీడియో రికార్డ్ చేసింది.ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.వేడిలో ఇతరులు కూడా దయ చూపాలని ఆమె ప్రజలను ప్రోత్సహించింది.

ఈ వీడియో త్వరగా వైరల్ అయింది, 54 లక్షల పైగా మందికి పైగా ఈ క్లిప్ చూశారు.సుచి శర్మ( Suchi Sharma) వీడియోకు చాలా మంచి స్పందన వచ్చింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

చాలా మంది నెటిజన్లు ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు.ఎండలో పనిచేసే వారికి సహాయం చేయడానికి ఆమె చూపించిన ఉత్సాహాన్ని వారు మెచ్చుకున్నారు.

Advertisement

సుచి శర్మ చేసిన పనికి కొందరు ప్రజలు స్ఫూర్తి పొందారు.ఇతరులు కూడా సులువైన మార్గాల్లో సహాయం చేయవచ్చని వారు సూచించారు.

వారు ఇంటి దగ్గరలోని డెలివరీ సిబ్బందికి లేదా కూరగాయల వ్యాపారులకు ఒక గ్లాస్ నీళ్లు ఇవ్వడం లేదా వేడిలో బాధపడే జంతువుల కోసం నీటిని బయట ఉంచడం వంటి చిన్న హెల్ప్ చేయవచ్చు అని చెప్పారు.

తాజా వార్తలు