ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై ఈడీ నుంచి కోర్టు వివరణ కోరింది.
ఈ నేపథ్యంలో సమాధానం ఇచ్చేందుకు ఈడీ న్యాయస్థానాన్ని సమయం కోరింది.దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది.