ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ముక్కు పచ్చలారని పసికందును ఓ యువకుడు ముళ్లపొదల్లో పడేశాడు.
కొన్నాళ్లుగా హైదరాబాద్ లో ఓ యువతితో షాబాజ్ అనే యువకుడు సహజీవనం చేస్తున్నాడు.గర్భవతి అయిన యువతికి పురిటినొప్పులు రావడంతో ఈనెల 23న ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ప్రసవం సమయంలో ఫిట్స్ రావడం యువతి మృతిచెందగా పాప జన్మించింది.ఈ క్రమంలో అంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకెళ్తూ షాబాజ్ పసికందును ముళ్లపొదల్లో పడేశాడు.
స్థానికుల సమాచారంతో పసికందును కాపాడిన పోలీసులు షేర్ అండ్ కేర్ సంస్థకు అప్పగించారు.అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.







