అనంతపురం జిల్లాలో అమానుష ఘటన.. !!

పోలీసుల్లో మంచి వారున్నారు చెడ్ద వారున్నారు అన్న విషయం విదితమే.ఈ మధ్యకాలంలో అయితే పోలీసులు చేస్తున్న మంచి పనులను చూస్తుంటే ముచ్చటేస్తుంది.

అంతే కాదు వారు చేస్తున్న సహాయం గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది.అది చూసిన నెటిజన్స్ అధికారుల్లో వస్తున్న మార్పుకు ఆశ్చర్యపోతున్నారట.

ఇంతలా పోలీసు వారిని పొగిడేస్తున్న నేపధ్యంలో ఒక ఎస్ఐ ప్రవర్తన పశువును మరిపిస్తుంది.న్యాయాన్ని కాపాడుతూ, ప్రజలను రక్షించ వలసిన ఇతను దళితుల భోజనంలో పేడ, మట్టి కలిపి తన క్రూరత్వాన్ని చాటుకున్నాడు.

అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప మండలం గంగవరంలో జరిగిన ఈ అమానుష ఘటన మానవత్వానికే ప్రశ్నలా మారింది.

Advertisement

బెలుగుప్ప ఎస్ఐ అన్వర్ బాషా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న దళితులు ప్రచారం మధ్యలో భోజనం కోసం వంట చేస్తుండగా అక్కడి చేరుకుని అనుమతి లేకుండా ఇక్కడ వంట ఎందుకు చేస్తున్నారంటూ పరుష పదజాలంతో దూషించారట.అంతటి ఆగకుండా తనలోని క్రూరత్వాన్ని బయటపెడుతూ తినడానికి సిద్ధంగా ఉన్న అన్నం, కూరలో పేడ, మట్టి వేశాడట.అసలు ఇంత రాక్షంగా ప్రవర్తించే వారు న్యాయవ్యవస్దను రక్షించే ఉద్యోగానికి పనికి వస్తారా అని అనుకుంటున్నారట విషయం తెలిసిన కొందరు.

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు