తన గానంతో ఎంతోమంది పల్లెటూరి వాళ్ళనే కాకుండా పట్నం వాళ్ళను కూడా చిందులు వేయించిన గాయని సింగర్ మంగ్లీ(S inger Mangli ).ఈమె కేవలం సింగర్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్ లలో చేసింది.
అలాంటి మంగ్లీ మారుమూల గ్రామం నుండి వచ్చి పెద్ద సింగర్ అవడం అనేది మామూలు విషయం కాదు.ఈమె మొదట్లో వి6 లో ప్రసారమయ్యే మాటకారి మంగ్లీ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
అలా ఈమె తన గానంతో ఎన్నో బోనాలు, వినాయకుడి,శివుడు,జానపద పాటలు పాడింది.అంతేకాకుండా బతుకమ్మ,సినిమా పాటలు కూడా పాడింది.
ఇక ఈమె మొదట శైలజ రెడ్డి అల్లుడు ( Shailaja reddy alludu ) అనే సినిమాలో పాట పాడి వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది ఇక ఈమె అలవైకుంఠపురం,లవ్ స్టోరీ, ధమాకా, జార్జ్ రెడ్డి,లవ్ స్టోరీ వంటి సినిమాల్లోనే కాకుండా ఇంకా చాలా సినిమాల్లో తన గానంతో అందరిని అలరించింది.మరీ ముఖ్యంగా మంగ్లీ పాట వస్తుంది అంటే చాలు ప్రతి ఒక్కరు డాన్స్ చేయాల్సిందే అనే విధంగా తన గొంతుతో ప్రతి ఒక్కరిని ఎట్రాక్ట్ చేసింది.
అలాంటి సింగర్ మంగ్లీ ( Singer Mangli ) ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.అయితే తాజాగా సింగర్ మంగ్లీ గురించి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది.అదేంటంటే సింగర్ మంగ్లీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట.ఇక ఈ న్యూస్ విని ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు.అయితే సింగర్ మంగ్లీ పెళ్లి చేసుకోబోయేది తమ బంధువుల అబ్బాయే అని వరుసకు బావ అయ్యే వ్యక్తిని సింగర్ మంగ్లీ వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరి నిజంగానే మంగ్లీ పెళ్లి పీటలెక్కబోతుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.