భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.అయితే కొంతమంది ఎలక్ట్రిక్ స్కూటర్లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.? ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ రేంజ్ ఎంత ఉంటుంది అనే విషయాలలో కాస్త ఆందోళన చెందుతున్నారు.అటువంటి వారి కోసం భారత రోడ్లపై తిరిగే బెస్ట్ టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్:
![Telugu Ather, India, Komaki Xgt, Ola Pro Gen, Simpleelectric, Topelectric-Techno Telugu Ather, India, Komaki Xgt, Ola Pro Gen, Simpleelectric, Topelectric-Techno](https://telugustop.com/wp-content/uploads/2024/03/Indias-top-5-best-selling-electric-scooters-price-and-features-detailsssa.jpg)
బెంగుళూరు ఆధారిత EV కంపెనీ సింపుల్ ఎనర్జీ కి చెందిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్( Simple One Electric Scooter ) ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 105kmph లు.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.1.45 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది.
ఓలా ఎస్1 ప్రో సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్:
![Telugu Ather, India, Komaki Xgt, Ola Pro Gen, Simpleelectric, Topelectric-Techno Telugu Ather, India, Komaki Xgt, Ola Pro Gen, Simpleelectric, Topelectric-Techno](https://telugustop.com/wp-content/uploads/2024/03/Indias-top-5-best-selling-electric-scooters-price-and-features-details-ola.jpg)
భారత దేశంలో అతిపెద్ద ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయ సంస్థ ఓలా కు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్( Ola S1 Pro Gen 2 ) సింగిల్ ఛార్జ్ పరిధి 195 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 120kmph లు.ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.1.30 లక్షలు.
ఏథర్ 450x ఎలక్ట్రిక్ స్కూటర్:
![Telugu Ather, India, Komaki Xgt, Ola Pro Gen, Simpleelectric, Topelectric-Techno Telugu Ather, India, Komaki Xgt, Ola Pro Gen, Simpleelectric, Topelectric-Techno](https://telugustop.com/wp-content/uploads/2024/03/Indias-top-5-best-selling-electric-scooters-price-and-features-detailssd.jpg)
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను( Ather 450X ) ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల పరిధి పొందవచ్చు.ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.1.33 లక్షల నుంచి రూ.1.36 లక్షల వరకు ఉంటుంది.
Komaki XGT X4 ఎలక్ట్రిక్ స్కూటర్:
![Telugu Ather, India, Komaki Xgt, Ola Pro Gen, Simpleelectric, Topelectric-Techno Telugu Ather, India, Komaki Xgt, Ola Pro Gen, Simpleelectric, Topelectric-Techno](https://telugustop.com/wp-content/uploads/2024/03/Indias-top-5-best-selling-electric-scooters-price-and-features-detailssa.jpg)
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ పరిధి 180 కిలోమీటర్ల నుంచి 220 కిలోమీటర్ల వరకు ఉంటుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.1.02 లక్షల నుంచి రూ.1.24 లక్షల వరకు ఉంటుంది.
ప్యూర్ EV EPLUTO 7G MAX ఎలక్ట్రిక్ స్కూటర్:
![Telugu Ather, India, Komaki Xgt, Ola Pro Gen, Simpleelectric, Topelectric-Techno Telugu Ather, India, Komaki Xgt, Ola Pro Gen, Simpleelectric, Topelectric-Techno](https://telugustop.com/wp-content/uploads/2024/03/Indias-top-5-best-selling-electric-scooters-price-and-features-detailsd.jpg)
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ చేస్తే, 150 నుంచి 201 కిలోమీటర్ల పరిధి వరకు ఉంటుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 60kmph లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.1.15 లక్షలు.