Indian worker: భారతీయుడిని బలి తీసుకున్న రిఫైనరీ ఉద్యోగం.. డ్యూటీలో వుండగానే సముద్రంలో పడి

సింగపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.విధి నిర్వహణలో వుండగానే ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.

 Indian Worker In Singapore Dies After Falling Into Sea , Indian Worker, Singapor-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.నవంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో మెర్లిమావు రోడ్‌లోని సింగపూర్ రిఫైనింగ్ కంపెనీలో బాధితుడు విధుల్లో వుండగా ఈ ఘటన జరిగిందని ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించి అతని మృతదేహాన్ని వెలికి తీశారు.41 ఏళ్ల మృతుడు గతంలో ప్లాంట్ జనరల్ సర్వీసెస్‌లో పనిచేశాడు.

ఎంవోఎం (మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్) ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది.రిఫనరీల్లో పరంజా (scaffolding operations) పనులను నిలిపివేయాలని బాధితుడు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు న్యూస్ ఏషియా తెలిపింది.

సముద్రాలు, భారీ నీటి వనరుల సమీపంలో పనిచేసే కార్మికుల భద్రతపై యాజమాన్యాలు దృష్టి సారించాలని ఎంవోఎం కోరింది.అయితే సింగపూర్‌లో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు.

ఈ ఏడాది జూన్‌లో నిర్మాణ స్థలంలో క్రేన్ మధ్యలో నలిగిపోవడంతో 32 ఏళ్ల భారతీయ కార్మికుడు మరణించిన సంగతి తెలిసిందే.

Telugu Indian, Merlimau, Ministry, Missouri, Shiva Datta, Singapore, Safety-Telu

ఇకపోతే.రెండ్రోజుల క్రితం అమెరికాలో తెలుగు విద్యార్ధి నీటిలో మునిగి మరణించిన సంగతి తెలిసిందే.వికారాబాద్‌కు చెందిన శివదత్త ఉన్నత చదువుల కోసం అమెరికాలోని మిస్సోరిలో వున్న సెయింట్ లూయిస్ వర్సిటీకి వచ్చి ఎంఎస్ చదువుతున్నాడు.

ఈ నేపథ్యంలో గత శనివారం తన స్నేహితుడితో కలిసి స్థానికంగా వున్న ఓ సరస్సు వద్దకు వెళ్లాడు శివదత్త.ఈ క్రమంలో అక్కడ ప్రమాదవశాత్తూ నీటిలో పడి వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube