హమ్మయ్య .. అమెరికాలో అదృశ్యమైన తెలుగు యువతి నితీశ క్షేమం

అమెరికాలో కనిపించకుండా పోయిన తెలుగు విద్యార్ధిని నితీశ కందుల( Nitisha Kandula ) (23) ఆచూకీ లభించింది.ఆమె క్షేమంగానే ఉన్నట్లు శాన్‌బెర్నార్డినో పోలీస్ శాఖ ప్రకటించింది.

 Indian Student Nitheesha Kandula, 23, Who Went Missing In Los Angeles , Los Ang-TeluguStop.com

శాన్‌బెర్నిర్డినో లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న నితీశ కందుల మే28న అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

ఆమె చివరిసారిగా లాస్ ఏంజిల్స్‌లో కనిపించినట్లుగా సీఎస్‌యూఎస్‌బీ పోలీస్ చీఫ్ ఆదివారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

నితీశ కందుల ఆచూకీపై ఎలాంటి సమాచారం తెలిసినా తక్షణం (909) 537-5165 నెంబర్‌లో సంప్రదించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.ఆమె 5 అడుగుల 6 అంగుళాల పొడవు, 160 పౌండ్లు (72.5 కిలోలు) బరువుతో నల్లటి జుట్టుతో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.బహుశా ఆమె కాలిఫోర్నియా లైసెన్స్ ప్లేట్‌తో 2021 మోడల్ టయోటా కరోలాలో వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నితీశ కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు ఆమె జాడను కనుగొన్నారు.దీంతో భారత్‌లోని ఆమె తల్లిదండ్రులు, సన్నిహితులు, ఇరు దేశాల్లోని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Telugu Calinia, Csusb, Indiannitheesha, Los Angeles, San Bernardino-Telugu Top P

కాగా.ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్ధుల హత్యలు, అదృశ్యాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు.గత నెలలో తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర చింతకింది అమెరికాలోని చికాగో నగరంలో కనిపించకుండా పోయాడు.మే 2 నుంచి ఆయన జాడ తెలియరావడం లేదని చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం వెల్లడించింది.

రూపేశ్ ప్రస్తుతం చికాగోలోని విస్కాన్సిన్‌లో వున్న కాంకార్డియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.అతని ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో నిరంతరం టచ్‌లో వున్నట్లు కాన్సులేట్ కార్యాలయం తెలిపింది.

రూపేశ్ జాడ త్వరలోనే తెలుస్తుందని.అతని గురించి ఎలాంటి సమాచారం వున్నా తమను సంప్రదించాల్సిదిగా పేర్కొంది.

Telugu Calinia, Csusb, Indiannitheesha, Los Angeles, San Bernardino-Telugu Top P

అంతకుముందు ఏప్రిల్‌లో తెలంగాణకే చెందిన పాతికేళ్ల విద్యార్ధి కూడా క్లీవ్‌లాండ్ నగరంలో కనిపించకుండాపోయి శవమై కనిపించాడు.హైదరాబాద్ నాచారంకు చెందిన మహ్మద్ అబ్ధుల్ అర్ఫాత్ .క్లీవ్‌లాండ్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేసేందుకు గతేడాది మేలో అమెరికా వెళ్లాడు.మార్చి నెలలో భారత్‌కు చెందిన 34 ఏళ్ల శాస్త్రీయ నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్ మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో కాల్చిచంపబడ్డాడు.

అలాగే పర్డ్యూ యూనివర్సిటీలో 23 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్ధి సమీర్ కామత్ ఫిబ్రవరి 5న ఇండియానాలో శవమై కనిపించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube