ట్రైన్‌లో వాటర్ బాటిల్ కొంటున్నారా..? ఇది మీ కోసమే..

మనలో ప్రతిఒక్కరూ ట్రైన్ ప్రయాణం( Train Journey ) చేసి ఉంటారు.ట్రైన్‌లో జర్నీ చేస్తుంటే చాలా సరదాగా ఉంటుంది.

చుట్టుపక్కల మొక్కలు, చెట్లు, పోలాలు అందంగా కనిపిస్తాయి.అలాగే రైలు ప్రయాణమంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

సరదాగా ఉండటమే కాకుండా కంపర్ట్‌గా ఉంటుంది.బస్సుల్లో ప్రయాణించాలంటే చాలా ఇరుకుగా ఉంటుంది.

అంత కంఫర్ట్ గా ఉండదు.అయితే రైలు ప్రయాణమంటే సీట్లు కొంచెం పెద్దగా, ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

అందుకే ఎక్కువమంది ట్రైన్ ప్రయాణం ఇష్టపడతారు.

అయితే ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు మన బోగీలోకి తిండి పదార్థాలు, వాటర్, కూల్‌డ్రింక్స్ లాంటివి విక్రయించేందుకు చిరు వ్యాపారులు వస్తూ ఉంటారు.వీరి దగ్గర చాలామంది ఆహార పదార్థాలతో పాటు వాటర్ బాటిల్ ( Water Bottle ) కొనుగోలు చేస్తూ ఉంటారు.ఇలాంటి వారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ)( IRCTC ) కీలక సందేశాన్ని ఇచ్చింది.

ప్రయాణికులకు మంచినీరు అందించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా బ్రాండెడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ ను తీసుకొచ్చింది.రైలు నీర్ పేరుతో ఈ వాటర్ వాటిల్ ను విక్రయిస్తోంది.

దీని ధర కూడా చాలా తక్కువగా ఉండటంతో చాలామంది కొనుగోలు చేస్తోన్నారు.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
రతన్ టాటా స్థాపించిన మొత్తం కంపెనీలు ఇవే..?

అత్యాధునిక ప్లాంట్లలో ప్రాసెస్, శుద్ది చేసిన నీటిని ఈ బాటిల్‌లో విక్రయిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ చెబుతోంది.రైల్ నీర్ వాటర్ బాటిల్ ధర కేవలం రూ.15 మాత్రమే.ఇతర బ్రాండెడ్ వాటర్ బాటిల్ ధర రూ.20 లేదా రూ.25 ఉంటుంది.కానీ దీని ధర తక్కువ కావడం, నీళ్లు స్వచ్చగా ఉండటంతో రైల్వే ప్రయాణికులు కొనుగోలు చేస్తోన్నారు.

Advertisement

అయితే చాలామంది వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.దీంతో ఆథరైజ్డ్ వెండర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని ఐఆర్‌సీటీసీ సూచించింది.

తాజా వార్తలు