రైలు ప్రయాణికులు అప్రమత్తం కావాల్సిందే.. లగేజీపై పరిమితులు

చాలా మందికి రైలు ప్రయాణాలంటే ఇష్టం.ప్రయాణం మధ్యలో టాయిలెట్‌కు వెళ్లొచ్చని కొందరు, ప్రయాణం సురక్షితమని మరికొందరు, విమానాలతో పోలిస్తే తక్కువ ఛార్జీలని మరికొందరు దీనికే ఓటేస్తారు.

 Indian Railways Charges For Carrying Extra Luggage In Train Journey Details, Tra-TeluguStop.com

సుదూర ప్రయాణాలకు నిజంగా రైలు ప్రయాణాలే సేఫ్ అని, సౌకర్యవంతంగా ఉంటాయని చాలా మంది భావిస్తారు.ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు తమతో పాటు లగేజీకి పరిమితులు లేకుండా తీసుకెళ్తుంటారు.

భారీగా సూట్‌కేసులు, ఇతర సంచుల్లో వస్తువులన్నీ నింపేసి రైలులో పెట్టేస్తుంటారు.ఇతరులు నడవడానికి కూడా ఒక్కోసారి ఇబ్బందిగా ఉన్నా పట్టించుకోరు.

దీనిపై రైల్వే శాఖ దృష్టి సారించింది.విమానాల తరహాలో లగేజీపై పరిమితులు విధించడం ప్రారంభించింది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇప్పటి వరకు రైలు ప్రయాణాలలో మనం ఇష్టం వచ్చినంత లగేజీ తీసుకు వెళ్లే వాళ్లం.

అయితే ఇక నుంచి అలా కుదరదు.పరిమితికి మించి లగేజీతో ప్రయాణిస్తే దానికి సంబంధించి అదనపు రుసుము చెల్లించాల్సిందే.

సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించే వారికి లగేజీ 35 కిలోల వరకు పరిమితి విధించారు.ఏసీ త్రీటైర్ కోచ్‌లలో ప్రయాణికులకు 40 కిలోలు, సెకండ్ క్లాస్ ఏసీలలో వెళ్లే వారు 50 కిలోలు, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లలో వెళ్లే వారు 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లొచ్చు.

Telugu Extra Luggage, Indian Railways, Passenger, Train, Train Journey, Travel-L

ఇది ఒక్కో ప్రయాణికుడికి మాత్రమే వర్తిస్తుంది.ఇద్దరుంటే దానికి తగ్గట్టే పరిమితులు ఉంటాయి.మరో వైపు ఎత్తు, వెడల్పులో కూడా నిబంధనలు ఉన్నాయి.100cm X 60 cm సైజ్ దాటితే రైలు ప్రయాణికులు లగేజీ కోసం బ్రేక్ వ్యాన్‌లో కొంత స్థలాన్ని కేటాయిస్తారు.దానికి రుసుము వసూలు చేస్తారు.ఇక పరిమితికి మించిన లగేజీపై రూ.30 చొప్పున వసూలు చేస్తారు.అందు కోసం చక్కగా ప్యాకింగ్ చేసి, రైలు బయల్దేరడానికి అరగంట ముందే స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube