అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు.వరుసపెట్టి డిబేట్లు, ఇంటర్వ్యూలు, ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇక తొలి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌లోనూ వివేక్ సత్తా చాటారు.విదేశాంగ విధానం, ఉక్రెయిన్ యుద్ధం, అమెరికన్ ఆర్ధిక, విద్యా వ్యవస్థలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
రిపబ్లికన్ డిబేట్ జరిగిన మరుసటి రోజే ఆయనకు ప్రజాదరణ, ఆన్‌లైన్ నిధుల సేకరణ పెరగడం విశేషం.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం 38 ఏళ్ల వివేక్ రామస్వామి బుధవారం జరిగిన రిపబ్లికన్ డిబేట్ తర్వాత తొలి గంటలోనే 38 డాలర్ల సగటు విరాళంతో 4,50,000 డాలర్లు సేకరించారు.అంతేకాదు.డిబేట్ తర్వాత వెలువడిన తొలి పోల్‌లో 504 మందిలో 28 శాతం మంది రామస్వామి అత్యుత్తమ పనితీరు కనబరిచారని ప్రశంసించారు.
అతని తర్వాత ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్( Florida Governor Ron DeSantis ) 27 శాతం, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ 15 శాతం , భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి( Nikki Haley ) 7 శాతం మంది మద్ధతుగా నిలిచారు.ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.
మొదటి రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ కోసం గూగుల్‌లో అత్యధిక శాతం మంది శోధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి వివేక్ రామస్వామే.ఆయన తర్వాత మరో భారత సంతతి అభ్యర్ధి నిక్కీ హేలీ వున్నారు.

ఇకపోతే.రిపబ్లికన్ తొలి డిబేట్‌లో వివేక్ రామస్వామి ప్రదర్శనపై అమెరికన్ మీడియా ఆసక్తికర కథనాలను ప్రచురించాయి.తొలి డిబేట్‌లో వివేక్ స్పాట్‌లైట్‌ను అందుకున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.డిబేట్‌లో సత్తా చాటినప్పటికీ ఫ్రంట్ రన్నర్ డోనాల్డ్ ట్రంప్‌ను అధిగమించడానికి ఆయన కొత్త వ్యూహాన్ని కనుగొన్నట్లు చాలా తక్కువ సంకేతాలు వున్నాయని ఫైనాన్షియల్ డైలీ పేర్కొంది.
వివేక్ రామస్వామి తొలి డిబేట్‌లోనే ఆధిపత్యం చెలాయించే వాగ్వివాదాలను తన ప్రత్యర్ధులకు ఎరగా వేశారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.కాగా.రిపబ్లికన్ పార్టీ తన సెకండ్ రౌండ్ డిబేట్‌ను సెప్టెంబర్ 27న కాలిఫోర్నియాలోని సిమి వ్యాలీలో నిర్వహించనుంది.







