చనిపోతాను అనుకున్నా.. ఎలా బతికానో: కరోనాను గెలిచిన భారత సంతతి యువతి అనుభవం

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి భయాందోళనలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.భూమ్మీద మూడొంతుల దేశాలను ఆక్రమించిన కరోనా ప్రస్తుతం కరాళ నృత్యం చేస్తోంది.

దీని నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు, ఇతర సంస్థలు చేయని ప్రయత్నం లేదు.ఇప్పటికే కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది.

ఈ క్రమంలో యూకేలో కోవిడ్ 19 నుంచి కోలుకున్న ఓ భారత సంతతి యువతి తన అనుభవాలను పంచుకున్నారు.భారత్‌కు చెందిన రియా లఖానీకి కరోనా సోకడంతో స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు.

ఈ కారణంగా తన భర్త, తల్లిదండ్రులు, తోబుట్టువులను అప్యాయంగా హత్తుకోలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చప్పారు.

Advertisement

దీనికి తోడు కొన్నేళ్లుగా అచలేషియా (అన్నవాహికలో ఇబ్బందులు)తో లఖానీ బాధపడుతున్నారు.సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఆమెకు నొప్పి ఎక్కువ కావడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు.

ఆమెకు సర్జరీ చేసుందుకు ఏర్పాట్లు చేశారు వైద్యులు.ఈ సమయంలో కొన్ని రోజులకు రియా జ్వరం, గొంతు నొప్పి వంటి ఇబ్బందులతో బాధపడ్డారు.అయితే శస్త్రచికిత్స కారణంగానే ఏర్పడిన సైడ్‌ఎఫెక్ట్స్‌గా తొలుత భావించిన వైద్యులు.

తర్వాత ఆమెకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.ఆసుపత్రిలోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న రియా ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.

ఈ సమయంలో చావు అంచుల దాకా వెళ్లి, బతికి బయటపడ్డానని భయానక పరిస్థితిని గుర్తుచేసుకున్నారు.జీవితం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడానికి ఎంత కాలం పడుతుందో తెలియదని రియా వ్యాఖ్యానించారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్

కరోనా వార్డుల్లో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న మెడికల్ సిబ్బంది నిజమైన హీరోలుగా అభివర్ణించారు.కాగా యూకేలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 7 వేల మంది మరణించగా.

Advertisement

దాదాపు 55 వేల మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజా వార్తలు