ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి.సమాజంలో వచ్చిన ఈ మార్పుకు సవాలక్ష కారణాలు.
కానీ దీని వల్ల కుటుంబాలకు కుటుంబాలే విచ్ఛిన్నమవుతూ.మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు.
చివరికి పసిపిల్లలు అనాథలుగా మిగులుతున్నారు.సామాన్యులే కాదు.
ప్రముఖులు, ఉన్నత హోదాల్లో ఉన్న వారు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు.తాజాగా అమెరికాలో ఓ కంపెనీ సీఈవోతో సంబంధం పెట్టుకున్న భారత సంతతి న్యాయవాదిపై వేటు పడింది.
నార్పోక్ సదరన్ కార్పోరేషన్‌లో( Norfolk Southern Corporation ) చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నబానితా నాగ్.( Nabanita Nag ) తన బాస్, కంపెనీ సీఈవో అలాన్ షాతో( Alan Shaw ) వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.కంపెనీ నిర్వహించిన స్వతంత్ర దర్యాప్తులో ఈ యవ్వారం నిజమని తేలడంతో ఇద్దరిని విధుల నుంచి తొలగించారు.ఇది వారి వ్యక్తిగత వ్యవహారమే అయినా ఇద్దరు ఉన్నతోద్యోగులు ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా కంపెనీ విధానాలు, కోడ్ ఆఫ్ ఎథిక్స్ నియమావళిని ఉల్లంఘించారని నార్పోక్ సదరన్ కార్పోరేషన్ తెలిపింది.
సీఈవోగా షా నిష్క్రమణ కారణంగా కంపెనీ పనితీరు, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, కార్యకలాపాల ఫలితాలపై ప్రభావం చూపదని కార్పోరేషన్ వెల్లడించింది.ఆయన తొలగింపు కారణంగా.కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మార్క్ ఆర్ జార్జ్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.
తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో .నాగ్ తనను తాను మూడు ఫార్చ్యూన్ 300 పబ్లిక్ కంపెనీలతో పనిచేసే సీజన్డ్ లీడర్‌గా పేర్కొన్నారు.ఆమె గతంలో గోల్డ్‌మన్ సాచ్స్‌లో విధులు నిర్వర్తించారు.2022లో నార్పోక్ సదరన్ కార్పోరేషన్ చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా, 2023లో కంపెనీ కార్పోరేట్ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.తొలుత 2020లో నార్పోక్ సదరన్‌లో జనరల్ కౌన్సెల్‌గా నబానితా చేరారు.
జార్జ్‌టౌన్ యూనివర్సిటీ నుంచి గవర్నమెంట్ అండ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ డిగ్రీ, న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్ పట్టాని పొందారు.