కెనడాలో పంజాబీ గ్యాంగ్‌స్టర్‌కు బిగుస్తోన్న ఉచ్చు .. భారత్‌కు రప్పించాలని కేంద్రం పావులు

ఖలిస్తాన్ వేర్పాటువాదులు కెనడాలో( Canada ) రెచ్చిపోతున్నారు.ప్రధాని జస్టిన్ ట్రూడో అండ చూసుకుని పేట్రెగిపోతున్నారు.

కొద్దిరోజుల క్రితం బ్రాంప్టన్‌లోని హిందూ మందిర్‌పై దాడికి దిగిన ఖలిస్తానీయులు( Khalistanis ) ఈ రచ్చను మరింత పెంచాలని చూస్తున్నారు.అయితే పాముకు పాలు పోసి పెంచితే ఏం జరుగుతుందో కెనడా ప్రభుత్వానికి, కెనడియన్లకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది.

కెనడాకు అసలు యజమానులం తామేనని, శ్వేత జాతీయులంతా యూరప్ లేదా ఇంగ్లాండ్ వెళ్లిపోవాలంటూ వారు హెచ్చరించారు.ఈ మేరకు ఓ ఖలిస్తాన్ అనుకూలవాది వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలాఉండగా.కెనడాను స్థావరంగా చేసుకుని పలువురు పంజాబీ గ్యాంగ్‌స్టర్లు తమ నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు.

Advertisement

వీరిలో అర్ష్ దల్లా( Arsh Dalla ) అలియాస్ అర్ష్‌దీప్ సింగ్ గిల్( Arshdeep Singh Gill ) కూడా ఒకడు.ఇతను తాజాగా బ్రిటీష్ కొలంబియాలో గృహ హింస కేసును ఎదుర్కొంటున్నాడు.

కోర్టు పత్రాల ప్రకారం.అర్ష్ దీప్ సింగ్ గిల్ డిసెంబర్ 19న అబాట్స్‌ఫోర్డ్‌లోని ప్రావిన్షియల్ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది.

గిల్ ఈ ఏడాది ఫిబ్రవరి 23న తొలిసారిగా బ్రిటీష్ కొలంబియా కోర్టు( British Colombia Court ) ఎదుట హారయ్యారు.

అక్టోబర్ 28న అంటారియోలోని హాల్టన్ రీజినల్ పోలీస్ సర్వీస్ (హెచ్‌ఆర్పీఎస్) అర్ష్ దీప్‌ను అరెస్ట్ చేసింది.ప్రస్తుతం మిల్టన్‌లోని అంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో బెయిల్ విచారణను అతను ఎదుర్కొంటున్నాడు.గతేడాది జూన్ 18న హత్యకు గురైన ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) సహచరుడిగా గిల్‌ను కోర్టు పత్రాల్లో పేర్కొనగా.

అదానిపై బాబు చర్యలు తీసుకుంటారా ? ఒత్తిడి పెరుగుతోందా ?
మీ దగ్గర కర్రీ స్మెల్ రాకూడదా.. ఈ ఎన్నారై మహిళ చిట్కాలు తెలుసుకోండి..!

భారత ప్రభుత్వం మాత్రం అతనిని ఉగ్రవాదిగా పరిగణిస్తోంది.

Advertisement

ఇటీవలి కాలంలో గిల్‌ను తమకు అప్పగించాలని భారతదేశం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కెనడియన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.పంజాబ్‌లో కిరాయి హత్యలు, టెర్రర్ ఫైనాన్సింగ్, దోపిడీలలో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్ష్ దల్లాను గతేడాది జనవరిలో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అతనిపై పలు కేసులను సైతం నమోదు చేసింది.

నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ సారథ్య బాధ్యతలను అర్ష్ దీప్ స్వీకరించాడని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

తాజా వార్తలు